ఆవాల‌తో మొటిమ‌లకు సులువుగా చెక్ పెట్టేయండిలా!

టీనేజ్ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి ప్ర‌ధానంగా వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు ముందుంటాయి.

మొటిమ‌ల స‌మ‌స్య చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ.చాలా ఇబ్బంది పెడుతుంది.

అందుకే మొటిమ‌లు అంటేనే భ‌య‌ప‌డిపోతుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు ముఖంపై ఒక్క మొటిమ వ‌చ్చినా తెగ ఫీల్ అయిపోతుంటారు.

ఈ క్ర‌మంలోనే దానిని ఎలా త‌గ్గించుకోవాలా అని తెగ హైరానా ప‌డిపోతుంటారు.అయితే ఆవాల‌తో ఎంత‌టి మొండి మొటిమ‌ల‌ను అయినా సులువుగా నివారించుకోవ‌చ్చు.

రోజువారి వంట‌ల్లో విరి విరిగా ఉప‌యోగించే ఆవాల్లో ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి.

ఆ పోష‌కాలు కేవ‌లం ఆరోగ్య ప‌రంగానే కాకుండా.సౌంద‌ర్య ప‌రంగా కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ముఖ్యంగా ఆవాల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమ‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

మ‌రి ఆవాల‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా కొన్ని ఆవాల‌ను తీసుకుని.

మొత్త‌గా పౌడ‌ర్ తీసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా ఆవ పిండి మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా డే బై డే చేస్తుంటే.ఖ‌చ్చితంగా మొటిమ‌లు మ‌రియు మ‌చ్చ‌లు త‌గ్గిపోతాయి.

ఇక రెండొవ‌ది.ఒక బౌల్‌లో కొద్దిగా ఆవాల పొడి, శెన‌గ‌పిండి, పెరుగు, ప‌సుపు వేసి బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట పాటు ఆర‌నివ్వాలి.

అనంతరం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తుంటే.

మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు ముఖం కాంతివంతంగా మ‌రియు అందంగా మెరుస్తుంది.

వైరల్ వీడియో: స్టేజిపై డాన్స్ తో అదరగొట్టిన మోనాలిసా