ముస్తాబైతున్న కేశవ పెరుమాండ్లు
TeluguStop.com
ముస్తాబైతున్న కేశవ పెరుమాండ్లు ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా :మాగా అమావాస్య సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ కేశవ పెరమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయం ముస్తాబవుతుంది.
ఈనెల 9న మార్గ అమావాస్య జాతర ఉన్నందున ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
400 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయాన్ని ఎల్లారెడ్డిపేట మండలం తో పాటు పరిసర మండలాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ కమిటీ పేర్కొంది.
మాఘ అమావాస్య సందర్భంగా ఎక్కడైనా ఆంజనేయస్వామి ఆలయాలలో పూజలు జరుగుతాయి కానీ ఎల్లారెడ్డిపేట లో ఉన్న శ్రీ లక్ష్మి కేశవ పెరమాండ్ల స్వామి వార్లకు ఉదయం నుండి అభిషేకాలు, అర్చన, కలశ పూజలు చేయడం ప్రత్యేకత ఉంటుంది.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని శ్రీ లక్ష్మీ కేశవ పెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పారిపెళ్లి రామ్ రెడ్డి,వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, సహాయ కార్యదర్శి వడ్నాల నారాయణ,
కోశాధికారి గంప నరేష్, రైటర్ గుండాడి వెంకటరెడ్డి, కమిటీ సభ్యులు తెలిపారు.
Slot Monster: How The Platform Works And What UK Players Should Know