అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ముస్తాబాద్ మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలపై గత రెండు నెలలుగా అఖిలపక్షం నాయకులు ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం అఖిలపక్ష నాయకులు తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తన భర్త పేరుతో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణం పంచాయత్ రాజ్ నిబంధనలు అతిక్రమించి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న నిర్మాణంపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారుల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వారి మొండి వైఖరికి నిరసనగానే ముస్తాబాద్ బంద్ కార్యక్రమం( Mustabad Bandh ) చేపట్టడం జరిగిందన్నారు.

శివకేశవ ఆలయ ప్రధాన రహదారి కావడంతో భవిష్యత్తులో భక్తులతో రద్దిగా ఉంటుందని గృహ సముదాయలకు వెళ్లే వీధి కాబట్టి గతంలో ఇంటి నిర్మాణం అనుమతి పొందిన వారికి మూడు ఫీట్ల సెట్ బ్యాక్ తో కలిపి 30 పిట్ల రోడ్డుగా ఉండాలని అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు.

అధికారం చేతిలో ఉందని సర్పంచ్ ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణం చేస్తుందన్నారు.

సామాన్యునికి ఒక న్యాయం మీకొక న్యాయమా అని ప్రశ్నించారు.అలాగే కాంగ్రెస్ నాయకుడు 9వ వార్డ్ సభ్యుడు బుర్ర రాములు మాట్లాడుతూ సర్పంచ్ కు అండగా నిలుస్తున్న బిఆర్ఎస్ నాయకులారా మీకు దమ్ముంటే నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం జరుగుతుందని  ప్రజలకు తెలియజేయండని సవాల్ విసిరారు.

ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ అంశంపై స్పందించాలని అధికార పార్టీ నాయకుల గ్రామాలకు జాతీయస్థాయి అవార్డులు ముస్తాబాద్ అభివృద్ధికి మాత్రం ఆటంకాలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అక్రమ నిర్మాణాలపై బహిరంగ ప్రకటన చేయాలని బీఆర్ఎస్ నాయకులను డిమాండ్ చేశారు.

మండల కేంద్రంలో జరుగుతున్న కొన్ని నిర్మాణాలు నిబంధనల ప్రకారం ఉన్నాయని నిరూపిస్తే ఈ విషయం ఇంతటితో వదిలేస్తామని తెలియజేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దీటి నర్సింలు,రమేష్ రెడ్డి,బుర్ర రాములు,పెద్దిగారి శ్రీనివాస్,బాద నరేష్,మీస స్వామి,తోట ధర్మేందర్,శ్రీకాంత్,పద్మ,గోపి,కోల కృష్ణ,వరి వెంకటేష్,కళ్యాణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

మన సీనియర్ హీరోలు ఎప్పుడు అవే సినిమాలా బోరు కొట్టడం లేదా..?