స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ సూపర్ ప్యాక్ ను తప్పక ట్రై చేయండి!
TeluguStop.com
స్పాట్ లెస్ స్కిన్ ( Spotless Skin )ను అందరూ కోరుకుంటారు.కానీ కొందరు మాత్రమే అటువంటి చర్మాన్ని పొందగలుగుతారు.
మిగతా వారికి ఏదో ఒక కారణం చేత ముఖంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడుతూనే ఉంటాయి.
వాటిని వదిలించుకునేందుకు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
? అయితే అస్సలు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ ప్యాక్ ను కనుక ట్రై చేస్తే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది.
అదే సమయంలో మరిన్ని అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను కూడా పొందుతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం సూపర్ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా గంధం చెక్కను ( Sandal Wood )వాటర్ సహాయంతో రాతిపై రుద్ది గంధాన్ని తీసుకోవాలి.
ఇప్పుడు ఈ స్వచ్ఛమైన గంధంలో పావు టీ స్పూన్ స్వచ్ఛమైన పసుపు( Turmaric ) మరియు పావు టీ స్పూన్ జాజికాయ పొడి( Nutmeg Powder ) వేసుకుని అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. """/" /
ఈ రెమెడీ సింపుల్ గా ఉన్న కూడా చర్మంపై మొండి మచ్చలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటించారంటే కొద్దిరోజుల్లోనే మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.
అలాగే ఈ రెమెడీ చర్మంలోని మృతకణాలు, మురికి, కాలుష్య కారకాలను తొలగిస్తుంది.మొటిమలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మరియు చర్మం పొడిబారకుండా సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. """/" /
తరచూ ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.ముడతలు ఉన్న కూడా క్రమంగా తగ్గు ముఖం పడతాయి.
కాబట్టి మచ్చలేని అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.
50 డేస్ సెంటర్ల విషయంలో పుష్ప ది రూల్ గ్రేట్ రికార్డ్.. అన్ని స్క్రీన్స్ లో రన్ అవుతోందా?