పొడవాటి నల్లని కురుల కోసం ఈ హెయిర్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!

అమ్మాయిల్లో చాలా మంది పొడవటి నల్లని కురులను ఇష్టపడుతుంటారు.అటువంటి హెయిర్ కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ ను అస్సలు మిస్ అవ్వకండి.

నెలకు కనీసం రెండు సార్లు ఈ ప్యాక్ ను కనుక వేసుకుంటే మీ జుట్టు నల్లగా పొడుగ్గా( Long And Black Hair ) పెరగడం ఖాయం.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ హెయిర్ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులను వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మెంతుల మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, ( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

ప‌దిహేను రోజులకు ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.

మెంతులు, కాఫీ పొడి, ఆముదంలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.

"""/" / జుట్టు ఎదుగుదల ను పెంచుతాయి.కురులు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

అలాగే కాఫీ పౌడర్ జుట్టు త్వరగా తెల్లబడకుండా రక్షిస్తుంది.నల్లటి మెరిసేటి కురులను మీ సొంతం చేస్తుంది.

అంతేకాదు పైన చెప్పిన హెయిర్ ప్యాక్ ను నెల‌కు రెండు సార్లు వేసుకోవడం వల్ల జుట్టు రాలడం, విరగడం, చిట్లడం వంటివి తగ్గుముఖం పడతాయి.

హెయిర్ హెల్తీగా స్ట్రాంగ్ గా మారుతుంది.మరియు చుండ్రు సమస్య ఉన్న కూడా దూరమవుతుంది.

అల్లు అర్జున్ ను ఆదర్శంగా తీసుకుంటే అందరూ పాన్ ఇండియా హీరోలే అవుతారా..?