లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!

అమ్మాయిల్లో చాలా మంది లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ ( Long Hair, Smooth Hair)కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.

అటువంటి జుట్టును పొందడానికి రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఫ్రూట్ మాస్క్(Fruit Mask) ఎంతో ఉత్త‌మంగా సహాయపడుతుంది.

ఈ మాస్క్ తో సులభంగా మ‌రియు వేగంగా లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్రూట్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కివి పండును(Kiwi Fruit) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కివి పండు (Kiwi Fruit)ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు(curd), వన్ టీ స్పూన్ తేనె (Honey)వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

"""/" / వారానికి ఒకసారి ఈ ప్రూఫ్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.

కివిలో విటమిన్ సి(Vitamin C) అధికంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

కొల్లాజెన్ జుట్టు నిర్మాణానికి మరియు బలానికి మ‌ద్ద‌తు ఇస్తుంది.కివిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి జుట్టును రక్షిస్తాయి.

"""/" / అలాగే ఈ కివి హెయిర్ మాస్క్ నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టుకు చ‌క్క‌ని పోష‌ణ అందించి ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా ప్రోత్స‌హిస్తుంది.

కివి యొక్క హైడ్రేటింగ్ లక్షణాలు స్కాల్ప్‌ను తేమగా ఉంచడంలో సహాయపడతాయి.చుండ్రు స‌మ‌స్య‌ను దూరం చేస్తాయి.

కివి పండులో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మ‌రియు విట‌మిన్లు జుట్టును స్మూత్ చేస్తాయి.

షైనీ గా మెరిపిస్తాయి.

పోలీస్ రోబోను ఆవిష్కరించిన చైనా.. క్రిమినల్స్‌ను పట్టుకుంటుందట..?