పొడవాటి జుట్టు కోసం ఈ వంటింటి చిట్కాను తప్పక ప్రయత్నించండి!

సాధారణంగా ఆడవారిలో చాలా మంది పొడవాటి జుట్టును( Long Hair ) కోరుకుంటూ ఉంటారు.

జుట్టును పొడుగ్గా పెంచుకునేందుకు మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన హెయిర్ గ్రోత్ సీరంలను తెచ్చుకుని వాడుతుంటారు.

అయితే అటువంటి సీరంలను వాడటం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే వంటింటి చిట్కాతో మాత్రం చాలా తక్కువ సమయంలోనే పొడవాటి జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ వంటింటి చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా ఒక కలబంద ఆకు( Aloevera Leaf ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) నాలుగు తుంచిన మందారం ఆకులు, నాలుగు మందారం పువ్వులు మరియు కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసి ఉడికించాలి.

దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించే స‌రికి వాటర్ జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.

"""/" / అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల జుట్టు పెరుగుదల అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

షార్ట్ హెయిర్ లాంగ్ గా మారుతుంది.అలాగే ఈ రెమెడీ హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది.

జుట్టును సిల్కీ గా షైనీ గా మెరిపిస్తుంది.అదే సమయంలో హెయిర్ ఫాల్ కు సైతం చెక్ పెడుతుంది.

నులిపురుగుల సమస్యకు ఈ ఇంటి చిట్కాల‌తో చెప్పండి బై బై..!