జుట్టు బలోపేతం కోసం ఈ కాఫీ హెయిర్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!
TeluguStop.com
జుట్టు కుదుళ్ళు బలహీనంగా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా అధికంగా ఉంటుంది.
దాంతో జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం నానా తంటాలు పడుతుంటారు.అయితే హెయిర్ ఫాల్ ఆగాలి అంటే ముందు జుట్టును మూలాల నుంచి బలోపేతం చేసుకోవాలి.
అందుకోసం ఇప్పుడు చెప్పబోయే కాఫీ మాస్క్ ను తప్పక ట్రై చేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్లు మెంతుల పొడి( Fenugreek Powder ), నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసుకుని సున్నితంగా పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఆపై షవర్ క్యాప్ ధరించాలి. """/" /
గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా లాభాలు పొందుతారు.
ముఖ్యంగా కాఫీ పొడి, దాల్చిన చెక్క, మెంతి పొడి లో ఉండే పలు పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.
జుట్టు రాలడాన్ని చాలా తొందరగా అరికడతాయి. """/" /
కాఫీలోని కెఫిన్ కంటెంట్ హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
జుట్టు వేగంగా మరియు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.దాల్చిన చెక్కలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో తోడ్పడతాయి.
మెంతి పొడి కూడా ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను ప్రోత్సహిస్తుంది.పొడి జుట్టును రిపేర్ చేస్తుంది.
చుండ్రు, దురవ వంటి సమస్యలను నివారిస్తుంది.ఇక పెరుగు మరియు కొబ్బరి నూనె జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి.
జుట్టు పెరుగుదలకు మద్దతు ఇస్తాయి.అంతేకాదు ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.
జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా మారుతుంది.
ఇక పరుగులు పెట్టిద్దాం .. ఏపీపై బిజెపి ఫోకస్