దేవుని కడపలో ముస్లింలు ఉగాది పూజలు.. ఇక్కడి విశిష్టత ఏమిటంటే..?

మన దేశంలో మతసామరస్యానికి ప్రజలు నిలువెత్తు నిదర్శనం.పండుగ ఏదైనా ఉగాది అయినా, రంజాన్, క్రిస్మస్( Ramadan, Christmas ) అయినా ప్రజలంతా కలిసి జరుపుకుంటూ ఉంటారు.

హిందువులకు ముస్లింలు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు.ఉగాది( Ugadi ) రోజు ఉగాది పచ్చడి సేవిస్తారు.

హిందూ దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు.ఆంధ్రప్రదేశ్ లోని దేవుని కడప ( God Kadapa )దేవాలయానికి విశిష్ట స్థానం ఉంది.

అక్కడ తెలుగువారి తొలి పండుగ ఉగాది పర్వదినాన్ని హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు.

శ్రీనివాసునికి కాయ కర్పూరం సమర్పించి ఇక్కడి పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.ఇందుకోసం ముస్లింలు స్వామి వారిని దర్శించుకోవడం దేవుని కడపలో ఉగాది పండుగ ప్రత్యేకత.

ఉగాది పండుగను కడపలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ప్రతి ఉగాది రోజు తిరుమల తొలి గడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి కానుకలు సమర్పించడం ఇక్కడి ముస్లింలకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అని ఇక్కడ స్థానికులు చెబుతుంటారు.

"""/" / ఉదయాన్నే దేవుని కడప దేవాలయానికి చేరుకుని, కాయకర్పూరం సమర్పించి ముడుపులు సమర్పిస్తారు.

ఉగాది రోజున వెంకటేశ్వరుని దర్శించి దేవాలయ పూజారికి బియ్యం సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఈ సంవత్సరమంతా సుఖసంతోషాలతో ఉంటారని ఇక్కడి ముస్లింలు నమ్ముతారు.

అందుకే క్రమం తప్పకుండా దేవునీ కడప ను ఇక్కడి ముస్లింలు ఉగాది రోజున సందర్శించి మత సామరస్యాన్ని చాటుతున్నారు.

చూసేవారికి కొత్తగా అనిపించిన తమ బీబీ నాంచారమ్మను శ్రీనివాసుడు పరిణయం చేసుకున్నారన్న కారణంతో కడప ముస్లింలు మాత్రం అత్యంత భక్తితో ఉగాది పండుగను జరుపుకుంటారు.

"""/" / తమ పూర్వీకుల నుంచి ఈ సంప్రదాయం వస్తుందని చెబుతున్నారు.ప్రజలు చేసినట్లు తమ ఇప్పుడు తేవడానికి వచ్చి ఉగాదిని జరుపుకుంటున్నామని చెబుతున్నారు మొత్తం మీద ఈ దేవాలయం మతసామరస్యాన్ని చాటీ చెబుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు అని స్థానికులు చెబుతున్నారు.

పవన్ ప్రాధాన్యం పెరుగుతోందిగా.. జమిలి ఎన్నికలొస్తే డబుల్ బెనిఫిట్