దీపావ‌ళి నాడు రాముడికి హార‌తి ఇచ్చిన ముస్లీం మ‌హిళ‌లు..

భార‌త‌దేశానికి ఒక గొప్పత‌నం ఉంది.అదే భిన్నత్వంలో ఏకత్వం.

ప్ర‌పంచంలోని ఏ దేశంలో లేన‌టువంటి ఈ ఔన్న‌త్యం కేవ‌లం ఇండియాలో మాత్ర‌మే ఉంది.

అందుకే మ‌న ఇండియాను ప్ర‌పంచ దేశాలు అంత గొప్ప‌గా కీర్తిస్తుంటాయి.మ‌త విధ్వేషాలు లేన‌టువంటి అన్ని మ‌తాల‌కు కేంద్రంగా భార‌త‌దేశం విరాజిల్లుతోంది.

అయితే ఈ న‌డుమ ఈ విధ‌మైన భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని చాటిచెప్పే ప‌రిస్థితులు లేవ‌ని చాలామంది అంటున్నారు.

కానీ అప్పుడ‌ప్పుడు అంద‌రినీ షాక్ కు గురి చేసే అంశాలు కొన్ని తెర‌మీదకు వ‌స్తున్నాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి అంద‌రి మ‌న‌సుల‌ను కొల్ల‌గొడుతోంది.నిజానికి చాలా మంది హిందువులు ముస్లిం దేవుళ్ల‌ను కొలుస్తుంటారు.

అలాగే ముస్లింలు కూడా హిందువుల పండుగ‌ల‌ను గౌర‌విస్తుంటారు.హిందూ స్వాముల‌కు వారు అన్న‌దానం కూడా చేస్తుంటారు.

ఇలాంటి గొప్ప త‌నాన్ని చాటిచెప్పే ఘ‌ట‌నే ఇప్పుడు జ‌రిగింది.ఆ కుటుంబం దాదాపు పదిహేనేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొన‌సాగిస్తోంద‌ని తెలుస్తోంది.

అయితే ఇక్క‌డ మ‌రో విశేషం కూడా ఉంది.ఏంటంటే ఈ కుటుంబం ఉన్న‌ది కూడా మోడీ నేతృత్వం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలోనిది.

వారణాసికి చెందిన‌టువంటి ఓ ముస్లిం మహిళ అయిన సంజీన్ అన్సారీ దాదాపు ప‌దిహేనేండ్లుగా రాముడికి హారతి ఇస్తోందంట‌.

"""/" / అదే సంప్రదాయాన్ని మ‌రోసారి అంటే నిన్న దీపావ‌ళి సంద‌ర్భంగా కొన‌సాగించ‌డం విశేషం.

నంజీన్ అన్సారీతో పాటు మ‌రికొంద‌రు మ‌హిళ‌లు కూడా నిన్న హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

వారు రాముడి పాటలు పాడుతూ ఆయ‌న్ను కొల‌వ‌డం ఇక్క‌డ విశేషం.ఇక ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారిపోయింది.

మ‌న దేశ ఔన్న‌త్యాన్ని ఈ ఫొటో చాటిచెబుతోంద‌ని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.ఇలాంటివి ఇప్పుడు చాలా అవ‌స‌ర‌మ‌ని, ఎంద‌రికో స్ఫూర్తిగా ఆ ముస్లిం మ‌హిళ నిలుస్తున్నారని చెబుతున్నారు.

వృద్ధుడిని పట్టుకుని తన మొగుడు అంటున్న యువతి.. రీల్స్ వీడియో వైరల్..