సొంత కుమారుడిని వివాహమాడింది అంటూ నెటిజన్ల ట్రోల్, నిజం కాదంటున్న ట్విట్టర్ యూజర్

సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఏ విషయం అయినా క్షణాల్లో వైరల్ అయిపోతున్న విషయం తెలిసిందే.

అయితే ఇటీవల ఈ సామాజిక మాధ్యమంలోనే ఒక విషయం పై నెటిజన్లు తెగ ట్రోల్ చేసుకుంటూ వచ్చారు.

ఇంతకీ ఆ విషయం ఏమిటంటే సౌదీ అరేబియా కు చెందిన ఒక మహిళ తన భర్త చనిపోవడం తో తన సొంత కుమారుడిని వివాహమాడింది అంటూ దానికి సంబందించిన ఒక ఫోటో షేర్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేశారు.

అయితే అసలు ఆ ఫోటో వెనుక కథ ఏంటి అన్నదానిపై ట్విట్టర్ యూజర్ ఒకరు వెల్లడించారు.

సామజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్న ఈ విషయంలో ఏమాత్రం నిజం లేదని, ఇస్లామిక్‌ క్యాప్షన్‌తో ట్వీట్ చేసిన ఈ ఫొటో కోసం తాను సోషల్ మీడియాలో 'రివర్స్ ఇమేజ్ సెర్చ్' చేయగా.

జనవరి 31న ఈ ఫొటోలు ఒక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసినట్టు గుర్తించానన్నారు.

ఈ ఫొటోకు ఉర్దూలో "ఇవాళ నా కుమారుడు ఖురాన్ పఠనం పూర్తి చేశాడు" అని క్యాప్షన్ ఉన్నట్టు జుబీర్ వివరించారు.

కానీ, ఈ ఫొటోను తీసుకుని ఓ నకిలీ ట్విట్టర్ ఖాతా ద్వారా 'సొంత కొడుకును పెళ్లాడిని తల్లి' అంటూ దుష్ప్రచారం చేశారని జుబీర్ పేర్కొన్నారు.

మొత్తానికి సోషల్ మీడియా ఏ రేంజ్ లో తమ పని చేసుకుపోతున్నాయో ఈ విషయం తెలుస్తుంది.

ఖురాన్ పఠనం పూర్తి చేసుకున్న తన కుమారుడి మెడలో దండ ఉండడం అలానే ఆమె మెడ లో కూడా దండ ఉండడం తో అందరూ ఇలా దుష్ప్రచారం చేసినట్లు తెలుస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌కు మొట్టికాయ వేసిన కోర్టు.. మ్యాటరేంటంటే?