టెస్లా భారత్ ఎంట్రీపై మస్క్ కీలక ప్రకటన

భారత్ లో టెస్లా ఎంట్రీపై ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశారు.

వీలైనంత త్వరగా తమ సంస్థ భారత్ లో అడుగుపెట్టనుందన్నారు.ఇండియా మార్కెట్ లోకి వచ్చేందుకు టెస్లా ఆసక్తిగా ఎదురు చూస్తుందని తెలిపారు.

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎలన్ మస్క్ తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మోదీకి తాను అభిమానినని మస్క్ పేర్కొన్నారు.భారత్ లో పర్యటించేందుకు ఎదురు చూస్తున్నానన్న మస్క్ వచ్చే సంవత్సరం తాను ఇండియాలో పర్యటిస్తానని తెలిపారు.

ఈ క్రమంలోనే స్టార్ లింక్ ను భారత్ లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

మరోవైపు మస్క్ తో అద్భుత సమావేశం జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఈ భేటీలో ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని మస్క్ ను కోరినట్లు తెలిపారు.

హీరో విశాల్ కి ఏమైంది… ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి కుష్బూ!