ఎక్స్ లో అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసిన మస్క్… కుర్రళ్ళకు పండగే!

సోషల్‌ మీడియా యాప్‌ ఎక్స్‌( App X ) (ట్విటర్‌)ను అదిరిపోయే యాప్‌గా తీర్చిదిద్దాడానికి ఎలాన్‌ మస్క్‌( Elon Musk ) తన సాయుశక్తులా ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తులు జరుగుతోంది.ఇప్పటికే ఆడియో/వీడియో కాలింగ్‌, పిక్‌-ఇన్‌-పిక్‌ మోడ్ వంటి ఫీచర్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన మస్క్‌.

కొత్తగా మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేశాడు.ఈ ఫీచర్ సాయంతో యూజర్లు వీడియో గేమ్‌లను స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చన్నమాట.

ఈ ఫీచర్‌ను మస్క్‌ స్వయంగా ఇప్పటికే 2 సార్లు పరీక్షించి చూశాడు.కాగా ఆయన దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ ఖాతాలో షేర్‌ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

"""/" / ప్రస్తుతం ఈ ఫీచర్ ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో వుండగా త్వరలో సాధారణ యూజర్లకు సైతం దానిని పరిచయం చేయనున్నట్లు సమాచారం.

''ఎక్స్ లో వీడియో గేమ్‌ స్ట్రీమింగ్ సిస్టమ్‌ను పరీక్షించాను.ఇది పనిచేస్తుంది'' అని మస్క్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ట్విచ్‌, యూట్యూబ్‌కు ఎక్స్‌ గట్టి పోటీ ఇస్తుందని కామెంట్లు పెడుతుండడం విశేషం.

ట్విచ్‌ అనేది అమెజాన్‌కు( Amazon ) చెందిన వీడియో గేమ్‌ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌.

అలానే, యూట్యూబ్‌లో కూడా వీడియో గేమ్‌లను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. """/" / మరోవైపు వీడియో గేమ్‌ స్ట్రీమింగ్( Video Game Streaming ) ఎలా చేయాలో వివరిస్తూ ఎక్స్‌ లో మీడియా ఇంజినీర్‌గా పనిచేస్తున్న మార్క్‌ కల్మాన్‌ ఓ వీడియోను తన ఖాతాలో షేర్ చేయగా అది కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన నాటినుండి దానిని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు.

కాగా ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) ట్రెండింగ్ లో వుండడం గమనార్హం.మాస్క్ ఎలాంటి షరతులు విధించినా దానిని వినియోగించేవారు నానాటికీ పెరుగుతుండడం విశేషం.

కమల్ హాసన్ విలన్ పాత్రల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాడా..? కారణం ఏంటి..?