మ్యూజిక్ స్కూల్ లో అడ్మిషన్ తీసుకోనున్న శ్రియా సరన్.. కారణమేంటంటే?

వెండితెరపై దాదాపుగా రెండు దశాబ్దాలుగా గ్యాప్ తీసుకోకుండా వరుస ఆఫర్లతో శ్రియ బిజీగా ఉన్నారు.

సీనియర్ హీరోల సినిమాల్లో శ్రియకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా శ్రియ మ్యూజిక్ స్కూల్ లో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.సాధారణంగా మ్యూజిక్ స్కూల్ అనగానే అందరూ శ్రియ మ్యూజిక్ నేర్పించే స్కూల్ లో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారని భావిస్తారు.

అయితే శ్రియ ప్రస్తుతం "మ్యూజిక్ స్కూల్" అనే సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారు.

ఈ సినిమాలో శ్రియ మ్యూజిక్ ద్వారా పిల్లల చదువుల గురించి చెబుతారని సమాచారం.

ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరైన ఇళయరాజా సంగీతం అందించనున్నారని తెలుస్తోంది.

యామినీ ఫిల్మ్స్ బ్యానర్ పై బియ్యాల పాపారావు డైరెక్షన్ లో మ్యూజిక్ స్కూల్ సినిమా తెరకెక్కుతోంది.

శ్రియ, శర్మాన్ జోషి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది.

"""/"/ ప్రస్తుతం తల్లిదండ్రులలో చాలామంది తమ పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లు చేయాలని భావిస్తూ పిల్లల ఇష్టాయిష్టాలకు, అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే.

క్రీడలు, కళలకు పిల్లలను తల్లిదండ్రులు దూరం చేయడం వల్ల పిల్లలు ఏ విధంగా నష్టపోతున్నారో ఈ సినిమాలో చూపిస్తారని సమాచారం.

"""/"/ ఈ సినిమాలో మొత్తం 12 పాటలు ఉంటాయని తెలుస్తోంది.సంగీతం ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాలో ఇతర సినిమాలతో పోలిస్తే పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.

ఈ సినిమాతో శ్రియ ఖాతాలో మరో హిట్ చేరుతుందేమో చూడాలి.కిరణ్ దేవ్ హాన్స్ అనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం గమనార్హం.

దేవర ఫస్ట్ సింగిల్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.. అది మాత్రం మైనస్ అంటూ?