యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ షాక్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇబ్బంది పెడుతున్నాడా?
TeluguStop.com
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తన సినిమాలకు పని చేసే మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
తను హీరోగా తెరకెక్కే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా ఈ హీరో ప్లాన్ చేసుకుంటారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా రూ.5 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని సమాచారం.
"""/"/
అయితే అనిరుధ్( Music Director Anirudh ) తమిళ ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యి దేవర సినిమా విషయంలో ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
ఈ విధంగా జరిగితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ షాక్ అని చెప్పాలి.
దేవర సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు.ఈ నెల 16వ తేదీన ఈ సినిమా నుంచి సైఫ్ అలీ ఖాన్ లుక్ సైతం రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
సైఫ్ అలీఖాన్( Saif Ali Khan ) ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు.
కథను నమ్మి ఈ సినిమా విషయంలో తారక్ ముందడుగులు వేస్తున్నారు.దేవర సినిమా మ్యూజిక్( Devara Movie ) తెలుగులో అనిరుధ్ కెరీర్ ను డిసైడ్ చేయనుంది.
ఈ సినిమా మ్యూజిక్ విషయంలో, బీజీఎం విషయంలో పొరపాట్లు చేస్తే అనిరుధ్ పై విమర్శలు తప్పవు.
అనిరుధ్ అద్భుతమైన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.అనిరుధ్ ఈ సినిమా విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.
"""/"/
సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలలో సాంగ్స్ ప్రత్యేకంగా ఉంటాయి.
దేవర సినిమాలో కూడా సాంగ్స్( NTR Devara Songs ) అదే విధంగా ఉండాలని ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గరవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.
షాంపూ సమయంలో ఈ ట్రిక్ పాటిస్తే మీ హెయిర్ సూపర్ షైనీ గా మారుతుంది!