మూవీ మేకర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్.. పెళ్లి ఒకరితో ఫస్ట్ నైట్ ఒకరితో అంటూ!
TeluguStop.com
టాలీవుడ్ ప్రముఖ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్( Thaman ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగులో ఎన్నో సినిమాలకు మంచి మంచి మ్యూజిక్ ని అందించి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు థమన్.
ఇకపోతే గత రెండు మూడు రోజులుగా తమన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
అదేమిటంటే ప్రస్తుతం తమన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ( Pushpa 2 ) మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
దేవి శ్రీ( Devisri ) పుష్ప 2కు అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. """/" /
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అంచనాలకు తగ్గట్టుగా ఉండాలని మూవీ మేకర్స్ ప్రతి ఒక విషయంలో చాలా రకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే పుష్ప 2 మూవీకి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరిపోలేదని, దీంతో దేవిని పక్కన బెట్టి అతని ప్లేస్‌లో డైరెక్టర్ తమన్ తో పాటు అజనీష్ లోక్‌నాథ్‌ని( Ajaneesh Loknath ) పుష్ప 2 లోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పుష్ప 1 మూవీకి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త మైనస్ అయ్యిందనని, ఎలివేషన్, క్లైమాక్స్ సీన్స్‌లో దేవీ శ్రీ ఇచ్చిన బీజీఎం సరిపోలేదని టాక్ వచ్చింది.
ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. """/" /
దీంతో ఇలాంటి సమయంలో గతంలో తమన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు అభిమానులు.
ఆ వీడియో తమన్ మాట్లాడుతూ.మ్యూజిక్ డైరెక్టర్ ల విషయంలో మూవీ మేకర్స్ అభ్యంతకరంగా వ్యవహరిస్తున్నారని, ఆ విషయం తనకు నచ్చలేదని షాకింగ్ కామెంట్ చేశారు.
కొంతమంది మూవీ మేకర్స్ సినిమాను పార్టులు గా విడగొట్టి.ఒక పార్ట్ ఒకరితో.
మరో పార్ట్ ఇంకొకరితో.ఒక సాంగ్ ఒకరితో.
ఆర్ఆర్ మరొకరితో చేయిస్తున్నారని, ఆ విషయం తనకు నచ్చడం లేదన్నారు.అలా సినిమాను పార్ట్ లుగా విడదీసి చేయిస్తుంటే.
'పెళ్లి ఒకరితో.శోభనం మరొకరితో.
చేయించినట్లుగా ఉంటుంది అంటూ సెటైరికల్ కామెంట్ వేశారు తమన్.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీవీఎస్ రవి డైరెక్షన్ లో రవితేజ సినిమా చేయబోతున్నాడా..?