వచ్చే జన్మలో నటి పూర్ణ కడుపున పుడతాను.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో మంచి పేరును సొంతం చేసుకున్న హీరోయిన్లలో పూర్ణ( Poorna ) ఒకరు.

గుంటూరు కారం సినిమాలో స్పెషల్ సాంగ్ లో కొన్ని సెకన్ల పాటు కనిపించిన పూర్ణ ఆ సాంగ్ తో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు.

స్టార్స్ సినిమాలలో పెద్దగా ఆఫర్లు రాకపోయినా పూర్ణ మాత్రం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

తాజాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ పూర్ణ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తమిళ మూవీ డెవిల్ ( Tamil Movie Devil )ఫిబ్రవరి నెల 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మిష్కిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కూడా పని చేశారు.

మిష్కిన్( Mishkin ) మాట్లాడుతూ డెవిల్ సినిమా డైరెక్టర్ ఆదిత్య నా తమ్ముడు కావడం వల్ల నేను అతనికి సపోర్ట్ చేస్తున్నానని అనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / డెవిల్ మూవీలో పూర్ణ అద్భుతంగా యాక్ట్ చేశారని మిష్కిన్ వెల్లడించారు.

పూర్ణకు, తనకు మధ్య ఏదో ఉందని కొంతమంది ప్రచారం చేస్తున్నారని అయితే పూర్ణ నాకు తల్లిలాంటి వారని మిష్కిన్ అన్నారు.

వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుట్టాలని కోరుకుంటున్నానని మిష్కిన్ కామెంట్లు చేశారు.మిష్కిన్ మాటలు విని పూర్ణ ఎమోషనల్ అయ్యారు.

మ్యూజిక్ డైరెక్టర్ మిష్కిన్ చేసిన కామెంట్లు ఆకట్టుకుంటున్నాయి. """/" / పూర్ణ మాట్లాడుతూ డెవిల్ తనకు సినిమా మాత్రమే కాదని జీవితానికి రిలేట్ అయిన ఎమోషన్ అని చెప్పుకొచ్చారు.

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని పూర్ణకు ఈ సినిమా కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

డెవిల్ సినిమాకు తమిళంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.హీరోయిన్ పూర్ణ రెమ్యునరేషన్ సైతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

గేమ్ చేంజర్ సినిమా మీద శంకర్ కాన్ఫిడెంట్ ఏంటి..?