ఏ.ఆర్.రెహమాన్ ను సత్కరించిన కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్..!

మ్యూజిక్ డైరక్టర్ గా ఇండియా తరపున అకాడెమీ అవార్డ్ అందుకున్న ఏ.ఆర్.

రెహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.ఆదివారం జరిగిన 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (సి.

ఐ.ఎఫ్.

ఎఫ్), కైరో ఒపెరా హౌజ్ లో ఏ.ఆర్.

రెహమాన్ ను సత్కరించారు.ఇక ఈ గౌరవం అందుకోవడంపై స్పందించిన రెహమాన్ ఈ గౌరవం అందుకోవడం సంతోషంగా ఉందని.

ఈజిప్ట్ ను సందర్శించినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.రోజా సినిమాతో కెరియర్ ప్రారంభించిన రెహమాన్ బాంబే, కదలన్, తిరుడా తిరుడి, జెంటిల్మన్ సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అయ్యాడు.

2008లో స్లం డాగ్ మిలీనియర్ సినిమాతో మ్యూజిక్ డైరక్టర్ గా ఆయన అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ ఏర్పడింది.

అంతేకాదు 81వ అకాడమీ అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది.రెహమాన్ కు రెండు గ్రామీ అవార్డులు, ఒక బాప్టా అవార్డు, గోల్డెన్ గ్లోబ్, నాలుగు నేషనల్ అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 13 ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులు వచ్చాయి.

తన మ్యూజిక్ తో ఎప్పటికప్పుడు సినీ ప్రియులను, మ్యూజిక్ ప్రియులను అలరిస్తున్న రెహమాన్ మరెన్నో ఇలాంటి అవార్డులు అందుకోవాలని కోరుతున్నారు ఆయన ఫ్యాన్స్.

 ప్రస్తుతం వరుస సినిమాలతో రెహమాన్ తన మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

ప్రభాస్ కల్కి సినిమాలో అమితాబ్ విలనా..? లేదంటే ప్రభాస్ కి హెల్ప్ చేసే క్యారెక్టరా..?