డిప్రెష‌న్ బాధితులు పుట్ట‌గొడుగులు తింటే ఏమ‌వుతుందో తెలుసా?

డిప్రెష‌న్‌.ప్ర‌స్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధిస్తున్న మాన‌సిక స‌మ‌స్య ఇది.

ఇష్ట‌మైన వారు దూరం అయిన‌ప్పుడు, గోల్స్ రీచ్ అవ్వ‌లేన‌ప్పుడు, నిద్ర లేమి, అధిక ఒత్తిడి, లైఫ్ స్టైల్‌, లైఫ్‌లో ఉండే కాంప్లికేషన్స్‌‌, మెనోపాజ్, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల డిప్రెష‌న్‌కి గురై నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.

ఇక పొర‌పాటున డిప్రెష‌న్‌ ను నిర్ల‌క్ష్యం చేశామా.ఇక ప్రాణాలే రిస్క్‌లో ప‌డ‌తాయి.

అందుకే డిప్రెష‌న్‌ను ఎంత త్వ‌ర‌గా త‌గ్గించుకుంటే అంత మంచిద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అటువంటి వాటిల్లో పుట్ట‌గొడుగులు కూడా ఉన్నాయి.

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తీసుకునే పుట్ట‌గొడుగుల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐర‌న్‌, సోడియం, జింక్‌, విటమిన్ సి, విట‌మిన్ డి, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

"""/" / అందుకే ఆరోగ్య ప‌రంగా పుట్ట‌గొడుగులు బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు అందిస్తాయి.ముఖ్యంగా డిప్రెష‌న్ వ్యాధితో బాధ ప‌డే వారు పుట్ట‌గొడుగులను త‌ర‌చూ తీసుకుంటూ ఉండాలి.

ఇలా చేస్తే పుట్ట‌గొడుగుల్లో ఉండే ఎర్గోథియోనిన్ అనే అరుదైన యాంటీ ఆక్సిడెంట్ డిప్రెష‌న్ నుంచి విముక్తిని క‌లిగిస్తుంది.

అలాగే ఒత్తిడి, ఆందోళ‌న త‌దిత‌ర మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను సైతం పుట్ట‌గొడుగులు స‌మ‌ర్థ‌వంతంగా నివారిస్తాయి.

పైగా, పుట్ట‌గొడుగుల‌ను త‌ర‌చూ తీసుకుంటే శరీరంలో ప్రోటీన్ కొర‌త‌ ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.ర‌క్త హీన‌త స‌మ‌స్య దూరం అవుతుంది.

క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గు ముఖం ప‌డుతుంది.ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగి పోతుంది.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.మ‌రియు మ‌ధుమేహం వ్యాధి ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటుంది.

వైరల్ వీడియో: సిక్సర్ వెళ్లిన బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని