వైఎస్సార్ కూడా టాలీవుడ్ హీరోలను అవమానించారు.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan ) కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ హీరోలను అవమానించారంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది.
అయితే గతంలో వైఎస్సార్ కూడా టాలీవుడ్ హీరోలను అవమానించారంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
మద్రాస్ నుంచి టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చినా సొంత బిల్డింగ్ కానీ స్థలం కానీ లేదని ఆయన తెలిపారు.
ఆ సమయంలో మేమంతా యూనియన్ లా ఏర్పడి ఒక భవనం కట్టుకోవాలని అనుకున్నామని మురళీ మోహన్ ( Murali Mohan )చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో స్థలం కొనడానికి అవసరమైన డబ్బులు యూనియన్ దగ్గర లేవని ఆయన తెలిపారు.
సినిమా అభివృద్ధి కోసం అప్పటికే 25 ఎకరాలు కేటాయించగా అందులో ఒక ఎకరం ఇస్తే యూనియన్ బిల్డింగ్ కట్టుకుంటామని అడగటానికి అప్పటి సీఎం వైఎస్సార్ ( CM YSR )దగ్గరకు వెళ్లామని మురళీ మోహన్ పేర్కొన్నారు.
"""/" /
ఆ సమయంలో నేను టీడీపీలో ఉన్నానని ఆయన తెలిపారు.మేము యూనియన్ బిల్డింగ్ గురించి అడగగా మురళీ మోహన్ రియల్ ఎస్టేట్ బాగా చేస్తున్నారు కదా అంత పెద్ద వ్యక్తి మీ వెనుక ఉండగా మీకు స్థలం ఇవ్వడం ఏంటి అని అనేశారని మురళీ మోహన్ వెల్లడించారు.
ఆ సమయంలో ఒక ఫోటో దిగాలని వైఎస్సార్ ను అడిగినా ఆయన అంగీకరించలేదని మురళీ మోహన్ పేర్కొన్నారు.
"""/" /
ఏఎన్నార్, చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్, నిర్మాతలు, దర్శకులు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన తెలిపారు.
ఫోటో దిగాలంటే 5 నిమిషాల పని అని స్టార్ హీరోలను సైతం వైఎస్సార్ ఇబ్బంది పెట్టారని మురళీ మోహన్ పేర్కొన్నారు.
మురళీ మోహన్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ కామెంట్ల గురించి ఎవరైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది.
నా లెగసీని కంటిన్యూ చేసేది అతనే…. బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు!