శ్రీదేవికి నాతో పెళ్లి చేయాలని భావించారు… మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!

జగమే మాయ(Jagame Maya) అనే సినిమా ద్వారా నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సీనియర్ నటుడు మురళీమోహన్(Murali Mohan) .

ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఇప్పటికీ పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో సహాయ నటుడిగా విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళీమోహన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు.

ఇక ఈయన సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారో, రాజకీయాలలో కూడా కొనసాగుతూ అంతే మంచి గుర్తింపు పొందారు.

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి మురళీమోహన్ పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.తాను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఒక 15 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో ఉంటానని భావించాను.

కానీ ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని తెలిపారు.ఇకపై తాను ఇండస్ట్రీలోని కొనసాగుతానని ఈయన వెల్లడించారు.

"""/" / ఇకపోతే ఇస్తాను అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswar Rao) గారికి అభిమానిని ఒకానొక సందర్భంలో నాగేశ్వరరావు గారు నన్ను చూసి ఇండస్ట్రీలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిని నేనేనని ఆయన నాకు సర్టిఫికెట్ ఇచ్చారు.

అలా ఆయన ఎందుకు ఇచ్చారు నాకు తెలియదని తెలిపారు.అయితే తను ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలోనే తనకు హీరోయిన్ శ్రీదేవినీ(Sridevi) నాకు ఇచ్చి పెళ్లి చేయాలని తన అమ్మగారు ఆలోచించారని మురళి మోహన్ వెల్లడించారు.

"""/" / నన్ను చూసిన ఆమె ఈయన చాలా మంచివాడులాగా బుద్ధిమంతుడిగా ఉన్నాడు ఇలాంటి వ్యక్తికి మన అమ్మాయిని ఇస్తే అమ్మాయి మంచిగా ఉంటుందని భావించి తనని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని భావించారని తనకి ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు అంటూ ఈ సందర్భంగా మురళీమోహన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆన్లైన్లో విషం తెప్పించుకొని సూసైడ్ చేసుకున్న హైదరాబాద్ టెక్కి..