ఆ హీరోయిన్ కెరీర్ వాళ్ళ అమ్మే నాశనం చేసింది : మురళి మోహన్

ఒక తరం వెనక్కి వెళితే చాలామంది హీరోలు మీరు నటించిన అందమైన హీరోయిన్స్ గురించి చెప్పండి అనగానే నిర్మూహమాటంగా అందరూ చెప్పే పేరు శ్రీదేవి( Sridevi ).

ఆమె ఎంతో అందంగా, ఎంతో మంచి బిహేవర్ కలిగి ఉండేది అని చెప్పేవారు.

మరి శ్రీదేవి తర్వాత మళ్లీ అంతటి అందం ఎవరికైనా ఉందా అని అడిగితే ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీ మోహన్ గారు సంచలన విషయాలను వెల్లడించారు.

ఆయన తరంలో నటించిన హీరోయిన్లలో శ్రీదేవి మహా అందగత్తె అని, ఆమె తర్వాత అందమైన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం నటి దీప( Actress Deepa ) మాత్రమే అని చెప్పారు.

"""/" / ఇక దీప జీవితం గురించి కూడా ఆయన అనేక విషయాలు మాట్లాడారు.

మనకి ముఖ్యంగా దీప గురించి తెలిసిన సినిమా స్వాతిముత్యం( Swatimutyam ).అందులో కమల్ హాసన్ కి హితబోధ చెప్పే పాత్రలో ఆమె కనిపిస్తూ ఉంటుంది.

అలాగే టాలీవుడ్ లో మొట్టమొదటగా లిప్ కిస్ ఇచ్చిన హీరోయిన్ కూడా దీప కావడం విశేషం.

చలంతో నటించిన ఒక సినిమాలో ఆమె మొట్టమొదటిగా అప్పటి వరకు ఎవరు చేయని విధంగా లిప్ లాక్ చేసింది.

ఇక దీప చాలా చిన్న వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఎంత చిన్న వయసు అంటే ఆమె సినిమా ఇండస్ట్రీకి వచ్చే సరికి దీప వయసు పదకొండేళ్లు మాత్రమే.

అప్పటికి ఆమె తల్లి దీప ను హీరోయిన్ చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నించిన 11 ఏళ్ల వయసులోనే అది సాధ్యమైంది.

"""/" / చాలామంది దీప గురించి ఏమంటారంటే చిన్న వయసులోనే ఆమెకు ఒళ్ళు పెరగడానికి స్టెరాయిడ్స్ ఇచ్చారని, హార్మోనల్ ఇంజక్షన్స్( Hormonal Injections ) తన తల్లి దగ్గర ఉండి మరి ఇప్పిచ్చేదని చెబుతూ ఉంటారు.

ఈ విషయాన్ని మురళీ మోహన్ గారు కూడా ఒప్పుకున్నారు.పదహారేళ్ళ వయసు వచ్చేసరికి 25 ఏళ్ల అమ్మాయిల ఆమె కనిపించేదని, కానీ అందంలో ఎంతో సౌందర్యంగా ఉండేదని కూడా చెప్పారు.

అప్పట్లో మురళీ మోహన్ కి దీపకు రిలేషన్ ఉందనే విషయం కూడా మాట్లాడుకున్నారు.

ఇక దీప ప్రస్తుతం ఒక కొడుకు, కూతురుతో, మనవడితో సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

కానీ చిన్న వయసులోనే చాలా ఇంజక్షన్స్ తీసుకోవడం వల్ల బాగా లావు అయిపోయింది.

ఇలా ఆ తల్లి సినిమా పిచ్చి కారణంగా అలాగే డబ్బు సంపాదన కోసం దీప జీవితాన్ని పణంగా పెట్టింది.

ఈ వారం థియేట్రికల్, ఓటీటీ క్రేజీ సినిమాలు ఇవే.. ఆ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయా?