మొహమాటానికి పోయి ఆ పదవి త్యాగం చేసిన హీరో వెంకటేష్
TeluguStop.com
టాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్ మురళీమోహన్( Murali Mohan ) గురించి స్పెషల్‌గా పరిచయం అక్కర్లేదు.
ఈ సినీ ప్రముఖుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 5 సార్లు ఎంపిక అయ్యాడు.
రీసెంట్‌గా మా అసోసియేషన్‌కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు.1993 నుంచి 1999 వరకు మురళీమోహన్ మా అసోసియేషన్‌కు జనరల్ సెక్రటరీగా కొనసాగాడు.
1999 నుంచి 2000 సంవత్సరం వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగాడు.
ఈ సమయంలో వెంకటేష్ వైస్ ప్రెసిడెంట్ లేదా ట్రెజరర్‌గా ఉన్నాడు.నిజానికి అప్పటికే మా అసోసియేషన్‌లో కీలక పదవుల్లో చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున( Chiranjeevi, Mohan Babu, Nagarjuna ) వంటి హీరోలు బాధ్యతలు నిర్వర్తించారు.
వెంకటేష్ ఒక్కడే అప్పటికీ మా అసోసియేషన్‌లో భాగం కాలేదు.ఈ అసోసియేషన్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు లేదా కమెడియన్ కాకుండా హీరోకి కీలక బాధ్యతలు ఇస్తే బాగుంటుందని మురళీమోహన్ అనుకునేవాడు.
హీరోలు అయితేనే ఏ పనినైనా ముందుకొచ్చి చాలా సమర్థవంతంగా అమలుపరచగలరని భావించేవాడు.అయితే అప్పటిదాకా వెంకటేష్ ఎలాంటి పదవులు తీసుకోలేదు కాబట్టి ప్రెసిడెంట్ పదవిని అతనికే అప్పజెప్పాలని తలచాడు.
కానీ వెంకటేష్ చాలా మొహమాటస్తుడు కావడంతో అవన్నీ నాకెందుకులే అంటూ సున్నితంగా నిరాకరించాడు.
"""/" /
కానీ మురళీమోహన్ ప్రెసిడెంట్ కావాల్సిందేనని పట్టుపట్టాడు.అయినా వెంకటేష్ ఒప్పుకోలేదు.
చివరికి వైస్ ప్రెసిడెంట్ గానైనా చేయమని బలవంతం చేస్తే అప్పుడు అందుకు వెంకటేష్ ఒప్పుకున్నాడు.
20 ఏళ్ల క్రితం నాటి ఈ సంఘటన గురించి తాజాగా మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
అతడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సంగతి తెలిసి వెంకీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. """/" /
ఇకపోతే 2021లో టాలీవుడ్ హీరో మంచు విష్ణు( Hero Manchu Vishnu ) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపిక అయ్యాడు.
కమెడియన్ రఘు బాబు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు.శివ బాలాజీ ట్రెజరర్ గా పనిచేస్తున్నాడు.
అయితే మురళీమోహన్‌కు కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల పట్ల ఉన్న భావనను కొంతమంది తప్పు పడుతున్నారు.
'సినిమాల్లో మాత్రమే వారు హీరోలు.నిజ జీవితంలో కాకపోవచ్చు.
కమెడియన్ అయినా మంచి మనసుంటే పదవులను నిజాయితీగా, సమర్థవంతంగా నిర్వహించగలరు' అని కామెంట్లు చేస్తున్నారు.