అత్యుత్సహం ప్రదర్శిస్తున్న మున్సిపల్ అధికారులు, సిబ్బంది

మూడు పువ్వులు ఆరు కాయలు గా వ్యవహారిస్తున్న వైనం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నూతన రెండో బైపాస్ రొడ్డుకు అనుకోని వున్నా వ్యవసాయ భూమిలో రైతు తన పొలం చుట్టూ హద్దులు దాటకుండా వేసుకున్నటు వంటి ఖనిలను ఈ రోజు మధ్యాహ్నం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అత్యుత్సహం తో తొలగించారు.

వెంటనే రైతు విషయాన్ని తెలుసుకొని మున్సిపల్ కార్యాలయం కి వెళ్లగా టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ నాయకులకు కొమ్ముకాస్తు, మాకేమైనా ఇస్తున్నారా మాకు కాంప్లెoట్ వచ్చింది అందుకే తొలగించాం అని పొంతన లేని సమాధానం ఇవ్వడం గమనార్హం.

ఈ విషయంపై ఓ పత్రిక విలేకరి కౌన్సిలర్ కి చరవాణిలో వివరణ అడుగగా నాకు ఎటువంటి విషయం తెలియదు అని చెప్పడం జరిగింది, జిల్లా కేంద్రంలో చాలా చోట్లా ప్రీ కాస్టింగ్ ఉన్న తొలించకపోవడంతో ముడుపులు ఎన్ని ముడుతున్నాయో అంటూ ప్రజలు వాపోతున్నారు.

‘ హైడ్రా ‘ కూల్చివేతలపై తలోమాట .. బీజేపీ లో గందరగోళం