మూలవాగులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వేములవాడ మూలవాగు నిండుకుండలా ప్రవహిస్తున్నందున ఈరోజు మున్సిపల్ పాలకవర్గ ఆధ్వర్యంలో ఆ గంగమ్మ తల్లికి గౌరవ పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని మా మున్సిపల్ పాలకవర్గం ఏర్పడినప్పటి నుండి వర్షాకాలంలో మూల వాగు నిండుకుండల ప్రవహిస్తుందని గంగమ్మ తల్లి అనుగ్రహంతోనే భారీ వర్షాలు తగ్గి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రజలందరినీ ఆ గంగమ్మ తల్లి కాపాడుకుందని వాగులో నీటి ప్రవాహం ఇలాగే ఎప్పుడూ ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల ఇంట ఎప్పుడు పండుగ వాతావరణం ఉండాలని ఆ గంగమ్మ తల్లి చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది.

ఎమ్మెల్యే రమేష్ బాబు కృషితో రైతులకు ప్రజలకు సాగునీరు తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన వేములవాడ మూల వాగులో కూడా ఎప్పుడు నీరు ఉండే విధంగా 3 చెక్ డ్యామ్ ల ను నిర్మించడం జరిగిందని ఈ చెక్ డ్యామ్ ల నిర్మాణాల వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులకు ప్రజలకు సాగునీరు త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ సహకారం ఎమ్మెల్యే రమేష్ బాబు కృషితో మల్కాపేట రిజర్వాయర్ నిమ్మ పెళ్లి రిజర్వాయర్ పూర్తయిన తర్వాత వాగులలో కేవలం వర్షాకాలంలోనే కాకుండా సంవత్సరం అంతా నిత్య జలాశయాలుగా ఉండడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యే రమేష్ బాబు కి మున్సిపల్ పాలకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలకు ఏమైనా ఆపద ఉంటే కౌన్సిలర్ దృష్టికి గాని అధికారుల దృష్టికి గాని మా దృష్టికి గాని తీసుకవస్తే సమస్యను తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.

మొన్న కురిసిన భారీ వర్షాలకు శిథిలావస్థలో ఇంటిలో నివసిస్తున్న వారిని అధికారులు గుర్తించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని, శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ఎవరు నివసించరాదని ఇంకా ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకరావాలని అన్నారు.

అదేవిధంగా అన్ని వార్డులలో వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా సానిటేషన్ పరంగా మా మున్సిపల్ సిబ్బందిచే బ్లీచింగ్ చల్లించి ఫాగింగ్ చేపిస్తామని వార్డ్ ల లో చెత్తాచెదారాన్ని తొలగించడం జరిగిందని,ఇంకా చెత్త చెదారం ఉంటే వాటిని కూడా తొలగించి డంపు యాడ్ కు తరలిస్తామని వారన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు,పట్టణ అధ్యక్షులు,నాయకులు,మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

శోభితతో పెళ్లి గురించి నోరు విప్పిన నాగచైతన్య.. పెళ్లి ఎక్కడ జరగనుందంటే?