థైరాయిడ్ ఉన్న‌వారు పెస‌లు తింటే ఏం అవుతుందో తెలుసా?

థైరాయిడ్.నేటి కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.

థైరాయిడ్ స‌మ‌స్య వ‌చ్చిదంటే.కొంద‌రు బ‌రువు పెరిగిపోతారు.

మ‌రికొంద‌రు స‌న్న‌గా బ‌క్క చిక్కిపోతుంటారు.ఇంకొంద‌రిలో నీర‌సం, జుట్టు రాలిపోవ‌డం, పిల్లలు పుట్టకపోవడం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి.

ఇక థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న వారు ప్ర‌తి రోజు మందులు వాడాల్సి ఉంటుంది.

అయితే కొన్ని కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే.థైరాయిడ్ స‌మ‌స్య‌కు సులువుగా స్వ‌స్థి ప‌ల‌క‌వ‌చ్చు.

అలాంటి ఆహారాల్లో పెస‌లు ఒక‌టి.పెస‌ళ్ల‌ను మామూలుగా కంటే మొలకెత్తించి తినడం వల్ల మ‌రిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.

ముఖ్యంగా థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న వారు ప్ర‌తి రోజు పెస‌లు తీసుకోవాలి.త్వ‌ర‌గా అరిగిపోయే పెస‌లు శ‌రీరానికి కావాల్సిన ప్రోటీన్స్ మ‌రియు మిన‌ర‌ల్స్ అందించ‌డంతో పాటు.

థైరాయిడ్ స‌మ‌స్య‌ను క్ర‌మంగా దూరం చేస్తుంది. """/" / అలాగే థైరాయిడ్ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవాల‌ని భావించే వారు.

ఆలివ్ ఆయిల్‌తో చేసిన ఆహారాలు తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పెంచ‌డంలోనూ, అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ ఆలివ్ ఆయిల్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అందువ‌ల్ల‌, థైరాయిడ్ ఉన్న వారు ఏవేవో నూనెలు కాకుండా.ఆలివ్ ఆయిల్‌తో త‌యారు చేసిన వంట‌లు తీసుకోవాలి.

ఇక ఎండు కొబ్బ‌రి కూడా థైరాయిడ్ స‌మ‌స్య‌ను నివారించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ఎండుకొబ్బరిని ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో తీసుకుంటే.

అందులో ఉండే ఎన్నో పోష‌కాలు థైరాయిడ్ స‌మ‌స్య‌ను క్ర‌మంగా త‌గ్గిస్తుంది.ఇక వీటితో పాటుగా చేప‌లు, గుడ్లు, పాల ప‌దార్థాలు, మున‌గాకు, ఉసిరి జ్యూస్ మ‌రియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్ స‌మ‌స్య దూరం అవుతుంది.

అదే స‌మ‌యంలో నీరు కూడా ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది.అప్పుడే థైరాయిడ్ స‌మ‌స్య‌‌కు శాశ్వ‌తంగా చెక్ పెట్ట‌గ‌ల‌రు.

K Keshava Rao : కాంగ్రెస్ చాలా గొప్ప పార్టీ..: ఎంపీ కేకే