ముంబై26/11 దాడులు జరిగి నేటికి 14 ఏళ్ళు కావటంతో రాష్ట్రపతి నివాళులు..!!

భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడి ముంబై26/11.సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఇదే రోజు పాకిస్తాన్ నుండి పదిమంది ఉగ్రవాదులు.

సముద్ర మార్గం గుండా ముంబైకి చేరుకుని.మారణ హోమం సృష్టించారు.

ముంబై వీధులలో రెస్టారెంట్లలో ఇంకా రైల్వేస్టేషన్ లో విచక్షణ రహితంగా అమాయకులపై కాల్పులు జరిపి మొత్తంగా 166 మంది ప్రాణాలను బలితీసుకున్నారు.

ఈ కాల్పులలో ఇతర దేశాలకు చెందిన వారు కూడా మరణించారు.ముఖ్యంగా తాజ్ హోటల్లో 9మంది ఉగ్రవాదులు.

సృష్టించిన విధ్వంసానికి దేశంతో పాటు ప్రపంచం వణికిపోయింది.అయితే ఈ ఉగ్ర దాడి జరిగి నేటికీ 14 సంవత్సరాలు కావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ లో నివాళులర్పించారు.

"ఈ దాడులలో ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయారు.అయితే విధి నిర్వహణలో ధైర్యంగా పోరాడి.

ఎంతోమంది భద్రతా సిబ్బంది కూడా తమ ప్రాణాలను త్యాగం చేశారు.వారి త్యాగాలను దేశం ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటది.

మృతులకు నివాళులు అర్పిస్తుంది" అంటూ.ట్విట్టర్ లో రాష్ట్రపతి ట్విట్ చేశారు.

Kodali Nani : ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీపై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!