ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు
TeluguStop.com
ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది.ఓ మైనర్ బాలికను ఐటమ్ అని పిలిచినందుకు యువకుడికి ఏడాదిన్నర జైలుశిక్షను విధించింది.
2015లో 16ఏళ్ల బాలిక తనను యువకుడు(25) లైంగికంగా వేధించాడని కేసు పెట్టింది.యువకుడు తన జుట్టు పట్టుకుని లాగి ఐటమ్ అని పిలిచాడని బాలిక కోర్టులో తెలిపింది.
దీనిపై గత గురువారం విచారణ చేపట్టిన కోర్టు అమ్మాయిలను అలా పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని చెప్పింది.