ఇదేంది భయ్యా ఇది.. వడాపావ్ మధ్యలో ఆ పిండి వంటకం..?!

అసలే వర్షాలు( Rains ) దంచికొడుతున్నాయి.కొన్నిచోట్ల వాన ముసురు అసలు తగ్గడం లేదు.

అయితే వర్షంలో వేడి వేడి ఆహార పదార్థాలు తినేందుకు చాలామంది ఇష్టపడతారు.

చల్లని వాతావరణంలో వేడి వేడి పదార్థాలు తింటే హాయిగా ఉంటుంది.అయితే చాలామంది వడాపావ్‌ను సాయంత్రం స్నాక్స్( Evening Snacks ) గా తింటూ ఉంటారు.

వడాపావ్ లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి.వివిధ రకాల ఐటమ్స్ ని కలిపి వాటిని తయారుచేస్తారు.

"""/"/ అయితే తాజాగా సోషల్ మీడియాలో చీజ్ చక్లి పావ్( Cheese Chakli Pav ) అనే ఫుడ్ వైరల్ గా మారింది.

ముంబైలోని శ్రీ కాశీ ఫుడ్రస్ అనే రెస్టారెంట్ దీనిని తయారుచేస్తుంది.ఈ స్పెషల్ వడాపావ్ లో మధ్యలో జంతికలు, చట్నీ, చీచ్ లాంటివి వేశారు.

ముందుగా ఒక బన్ ను కట్ చేసి మధ్యలో జంతిక, చట్నీ, చీజ్ లాంటి వాటితో దానిని ఫిల్ చేసి ఓవెన్ లో కాసేపు పెట్టారు.

ఆ తర్వాత తీసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు.ఇటీవల ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దీనిని వీడియో తీసి షేర్ చేశాడు.

దీంతో వీడియో కాస్త వైరల్ గా మారింది. """/"/ ఇప్పటివరకు ఈ వీడియోకు 22 వేలకుపైగా లైక్ లు వచ్చాయి.

ఈ వెరైటీ ఫుడ్ ఐటమ్( Variety Food Item ) పేరును చీజ్ చక్లీ పావ్ గా చెబుతున్నారు.

ముంబైలో వడాపావ్, గోల్ గప్ప లాంటివి చాలా ఫేమస్.వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు.

ఇప్పుడు ఈ వెరైటీ ఐటెంను తినేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.వడాపావ్( Vadapav Chakli ) మధ్యలో జంతికలు పెట్టి తయారుచేయడంతో ఈ వెరైటీ ఫుడ్ ఐటెం పాపులర్ అయింది.

ఏం ఐడియాలు అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఇలాంటి ఐడియాలు అసలు ఎలా వస్తాయంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇలా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఆస్కార్‌ రేసులోకి ఎంట్రీ ఇచ్చిన ‘కంగువా’