నర్సు యూనిఫాంలో హాస్పిటల్ కి వెళ్ళిన ముంబై మేయర్

కరోనాని నియంత్రించేందుకు వైద్య సిబ్బంది నిద్రాహారాలు మాని నిరంతరం ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని రోగులకి చికిత్సలుఅ అందిస్తో వారి చిత్తశుద్ధి చూపించుకున్తున్నారు.

కరోనా రోగుల పక్కనే ఉంటూ వారికి వ్యాధిని తగ్గించే ప్రయత్నం చేస్తున్న డాక్టర్లే ప్రస్తుతం దేవుళ్ళుగా అందరికి కనిపిస్తున్నారు.

ఈ సమయంలో మనుషులలో ఉండే మానవత్వం తప్ప ఈ దైవత్వం మనల్ని కాపాడలేదు అనే విషయాన్ని చాలా మంది గ్రహించారు.

ఈ నేపధ్యంలో వైద్యుల సేవలని కొనియాడుతున్నారు.వారికి అండగా ఉంటూ మద్దతు తెలియజేస్తున్నారు.

ప్రభుత్వం, నాయకులు, ఇతర అధికారులు కూడా వైద్యులకి అండగా నిలబడుతున్నారు.ఇదిలా ఉంటే బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ కిశోరీ పెడ్నేకర్ బీవైఎల్ నాయర్ హాస్పిటల్ ను ఇవాళ సందర్శించారు.

ఈ హాస్పిటల్ కు ఆమె నర్సు యూనిఫాంలో వెళ్లారు.ఆసుపత్రి సిబ్బందిని కలిసి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల అడిగి తెలుసుకున్నారు.

అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, గతంలో తానూ నర్సుగా పనిచేశానని, ఈ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు తనకు తెలుసని అన్నారు.

నర్సింగ్ సిబ్బంది కి ధైర్యం చెప్పేందుకే తాను నర్సు యూనిఫాంలో వెళ్లానని, ప్రస్తుత సంక్షోభ సమయంలో మనమంతా కలిసికట్టుగా నిలిచి ఈ పోరాటాన్ని కొనసాగించాల్సి ఉందని అన్నారు.

మొత్తానికి మేయర్ వైద్య సిబ్బందిని ప్రోత్సహించేందుకు చేసిన పని హర్షణీయంగా ఉందని చాలా నెటిజన్లు కూడా సోషల్ మీడియా లో కామెంట్లు పెడుతున్నారు.

మునుపటి కంటే బలంగా ఉన్నా.. చైతూతో విడాకులపై సమంత కామెంట్స్ వైరల్!