పోలీస్ మీదికే ఎగిరాడు.. ఆ తర్వాత ఏడుస్తూ కూర్చున్నాడు..!
TeluguStop.com
చాలా సందర్భాల్లో కొందరు వ్యక్తులు ప్రవర్తించే తీరు చాలా మందికి నచ్చదు.తప్పు వారి వైపే ఉన్నా కానీ రెచ్చిపోతుంటారు.
ఎదుటి వారిని అమాయకులుగా భావించి గొడవకు దిగుతుంటారు.ప్రస్తుత రోజుల్లో యూత్ చాలా మంది విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
తాగిన మత్తులోనో లేక తమకు అధికారం ఉందనే గర్వంతోనో ఇలా చేస్తుంటారు.అలాంటి వాటిని ట్రాఫిక్ పోలీసులు పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు.
రీసెంట్ గా ముంబై నగరంలో ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసుపై ప్రతాపం చూపించాడు.
అసభ్య పద జాలంతో దూషించాడు.కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
అందరు ట్రాఫిక్ పోలీసుల్లా ఆయన యువకులు తిడుతుంటే ఊరుకోలేదు.వారిని కేసులు బుక్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
తర్వాత యువకులకు దిమ్మతిరిగి.చేసిందంతా అర్థమయి బోరున ఏడుస్తూ ఓ మూలన కూర్చున్నారు.
ఇది చూసిన నెటిజన్లు భిన్న రకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కారు రాంగ్ ప్లేస్ లో పార్క్ చేశావని ట్రాఫిక్ పోలీసులు చెప్పిన దానికే ఆ యువకుడు చేసిన హంగామా మామూలుగా లేదని అంటున్నారు.
"""/"/
కారు రాంగ్ ప్లేస్ లో పార్క్ చేసి రోడ్డు నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు బహిరంగ ప్రదేశంలో మాస్కు లేకుండా తిరిగారని పోలీసులు రెండు కేసులు పెట్టారు.
దెబ్బకు ఆ యువకుడికి బొమ్మ కనబడింది.నానా హంగామా చేసిన అతడే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కోటింగ్ ఇచ్చిన తర్వాత గప్ చుప్ గా ఓ మూలన కూర్చున్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో దుమ్ము లేపుతోంది.ఇది చూసిన నెటిజన్లంతా లైకులు, కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు.
పోలీసుల పై ఆ యువకుడు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదంటూ కామెంట్ చేస్తున్నారు.
నాన్నకు దక్కని అదృష్టం నాకు దక్కింది.. బాలయ్య కామెంట్స్ వైరల్!