దుమ్మురేపిన డికాక్ .. ముంబై ఘన విజయం !
TeluguStop.com
ఐపీఎల్ 2020 సీజన్ ముంబై ఇండియన్స్ హవా కొనసాగుతోంది.అబుదాబిలో కోల్‌కతాపై సునాయాసంగా గెలిచి.
పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది.149 పరుగుల లక్ష్యాన్ని 16.
5 ఓవర్లలో చేధించి.విజయం అందుకుంది.
కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
44 బంతుల్లో 78 పరుగులు చేశాడు.ఈ ఇన్సింగ్స్‌లో 3 సిక్స్ లు, 9 ఫోర్లతో కోల్‌కతా బౌలింగ్ ను ఊచకోత కోశాడు.
ఇక , కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులతో రాణించాడు.చివర్లో బిగ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా మెరిశాడు.
10 బంతుల్లో 20 పరుగులు (1 సిక్స్, 3 ఫోర్లు) చేశాడు.కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివం మావి చెరో వికెట్ సాధించారు.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 రన్స్ చేసింది.
కమ్మిన్స్ 53 రన్స్‌తో అదరగొట్టాడు.కెప్టెన్ మోర్గాన్ 31 పరుగులతో బాధ్యాతాయుత ఇన్సింగ్స్ ఆడాడు.
శుభమాన్ గిల్ 21 రన్స్ చేశాడు.మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా స్కోర్ చేయలేదు.
టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమయింది.ఆ తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కమ్మిన్స్ జోడి అద్భుతంగా ఆడి.
మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.ఇద్దరూ కలిసి 87 పరుగులు చేశారు.
ది రాజాసాబ్ మూవీ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. మారుతి రియాక్షన్ ఇదే!