టైటిల్ వేట లో మరింత ముందుకు వచ్చిన ముంబై !
TeluguStop.com
ఐపీఎల్ లో ముంబై మరొకసారి కప్పు కి గురు పెట్టింది.ఇప్పటికే ఐదు ఐపిఎల్ టైటిల్స్ ను తన కాతా లో వేసుకున్న ముంబై( Mumbai Indians ) మరో టైటిల్ దిశగా వేగంగా దూసుకొస్తుంది.
బుధవారం ఎలిమినేటర్ వన్ మ్యాచ్లో బాగంగా లక్నో సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్లో 80 పరుగులు తేడాతో భారీ విజయాన్ని సాధించింది .
లీగ్ మ్యాచ్ ల వరకు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన లక్నో ముంబైతో మ్యాచ్లో మాత్రం అన్ని రంగాల్లోనూ తేలిపోయింది.
అద్భుతమైన ఫీల్డింగ్,,బ్యాటింగ్ , బౌలింగ్ నైపుణ్యాలతో మ్యాచ్ అధ్యంతం అదరగొట్టిన ముంబై టైటిల్ వేటలో మరొక అడుగు ముందుకు వేసింది.
ముఖ్యంగా యువ ప్లేయర్ ఆకాశమద్వాల్( Akash Madhwal ) లక్నో పతనాన్ని శాసించాడని చెప్పవచ్చు.
ఐదు వికెట్ల హాల్తో మ్యాచ్ ముంబై వైపు తిప్పేశాడు. """/" /
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తున్నందున ఆచితూచి ఆడింది కెమెరాన్ గ్రీన్ 41 పరుగులు , సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు చివర్లో తిలక్ వర్మ ,26 పరుగులు ఇంపాక్ట్ ప్లేయర్ వదెరా 23 పరుగులతో మెరుపులు మెరూపించారు.
183 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్ ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్( Lucknow Super Giants ) 16.
3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది ఆ జట్టు బ్యాట్స్మెన్లలో మార్కస్ స్టయినీస్ తప్ప ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేకపోవడం విశేషం.
మొత్తానికి తన ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ తో మ్యాచ్ను తన ఖాతాలో వేసుకున్న ముంబై గుజరాత్ తో మ్యాచ్తో అమీ తుమి తేల్చుకోబోతుంది ఈ ఒక్క గండాన్ని దాటి ఫైనల్ కు ముంబై వెళ్తే మాత్రం మరో రసవత్తర పోరుకు ఫైనల్ వేదికగా మారబోతుంది.
"""/" /
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ప్రజాభిమానం పొందిన జట్లుగా పేరు పొందిన ముంబై చెన్నై సూపర్ కింగ్స్ జెట్లు మరొక్కసారి తలపడితే మాత్రం జియో సినిమా యాప్ క్రాష్ చేసే స్టయి రేటింగ్స్ వస్తాయని చెప్పవచ్చు .
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి31, శుక్రవారం 2024