ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎంత పేలవ ప్రదర్శన కనబర్చిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.
ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ఈ జట్టు, మునెపెన్నడూ లేనంత దారుణంగా ఈ సీజన్‌లో రాణిస్తోంది.
చివరికి తొమ్మిదో మ్యాచులో విజయం దక్కింది.అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ళందరూ దాదాపు విఫలమయ్యారు.
2008, 2009 సీజన్ లలో ప్రదర్శించిన చెత్త ప్రదర్శన కంటే దారుణంగా ఈ సీజన్ లో ఆ జట్టు ఆడుతుంది.
మొదటి 8 మ్యాచులకి 8 మ్యాచులు ఓడిపోయింది.ఆడిన 12 మ్యాచుల్లో కేవలం మూడింట్లో మాత్రమే నెగ్గింది.
అలాంటి.జట్టుకు మైదానం లోపల కలిసిరావడం లేదనుకుంటే.
బయట కూడా నిరాశే ఎదురవుతోంది.ట్విటర్ వేదికగా ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ జట్లుగా ఐపీఎల్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ నిలిచాయి.
ఏప్రిల్ నెలకు సంబంధించి ట్విటర్ వేదికగా జరిగిన ఇంటరాక్షన్స్ ఆధారంగా ఈ మూడు టీమ్స్ పాపులర్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఇక అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన సీఎస్‌కే, ఆర్‌సీబీ గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
ఇంక, అత్యంత ఆదరణ గల ముంబై ఇండియన్స్ మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
ఆ జట్టు పేలవ ప్రదర్శనతో అందరికన్నా ముందే ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకుంది.
"""/"/
చెన్నై టీమ్ పేరిట 670 మిలియన్ల ఇంటరాక్షన్స్ జరగ్గా.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట 420 మిలియర్ల ఇంటరాక్షన్స్ జరిగాయి.