న‌టితో ముంబై ఇండియన్స్ కెప్టెన్ డేటింగ్? వీడియో వైరల్

భారత క్రికెట్(Indian Cricket) జట్టులో ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మరోసారి వార్తల్లో నిలిచాడు.

అయితే, ఈసారి అతని ఆటతో కాదు.వ్యక్తిగత జీవితం కారణంగా.

మొదట నటాషా స్టాంకోవిచ్‌తో ( Natasha Stankovich)పెళ్లి, పిల్ల, విడాకులు అంటూ హార్దిక్ పేరు వినిపించగా.

ఇప్పుడు ఇంగ్లాండ్‌కు చెందిన గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

"""/" / హార్దిక్ పాండ్యా బాలీవుడ్ మోడల్, నటి నటాషా స్టాంకోవిచ్(Actress Natasha Stankovich) మధ్య ప్రేమకథ 2019లో మొదలైంది.

డిసెంబర్ 31, 2019 న వీరిద్దరూ దుబాయ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని, 2020లో ఓ పండంటి మగబిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు.

ఈ జంట తమ ప్రేమను మరింత ఘనంగా ప్రకటించుకునేందుకు 2023 ఫిబ్రవరి 14న, వాలెంటైన్స్ డే రోజున, రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో భారీ స్థాయిలో రెండోసారి వివాహం చేసుకున్నారు.

అయితే, ఈ పెళ్లి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు.వివాహానికి కేవలం కొన్ని నెలలకే విభేదాలు వచ్చాయి.

2024 జులై 19న హార్దిక్-నటాషాలు(Hardik-Natasha) విడిపోతున్నట్లు ప్రకటించగా, ఆగస్టులో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి.

"""/" / నటాషాతో విడాకుల తర్వాత, హార్దిక్ పేరు బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో (Jasmine Wali)జతకడుతున్న వార్తలు వైరల్ అయ్యాయి.

ఇద్దరూ కలిసి గ్రీస్ వెకేషన్ కు వెళ్లినట్లు కొన్ని ఫొటోలు లీక్ అవ్వగా, అప్పటి నుంచే ఈ రూమర్లు మొదలయ్యాయి.

ఈ వార్తలకు మరింత బలమైన ఆధారంగా తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2025లో(IPL2025) ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లకు జాస్మిన్ వాలియా(Jasmine Wali) హాజరుకావడం.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలోనూ హార్దిక్ ఆడే మ్యాచ్‌లకు జాస్మిన్ హాజరైనట్లు అభిమానులు గమనించారు.

"""/" / ఈ రూమర్లను హార్దిక్ కానీ, జాస్మిన్ కానీ ఇప్పటి వరకు ధృవీకరించలేదు.

కానీ, ఇటీవల ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాదే జరిగిన మ్యాచ్‌లో జాస్మిన్ వాంఖడే స్టేడియంలో సందడి చేయడం, ముంబై ఇండియన్స్ బస్సులో కనిపించడం నెటిజన్లకు మరింత మద్దతుగా మారింది.

ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.హార్దిక్ పాండ్యా క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాట్, బాల్‌తో సందడి చేస్తే.

గ్రౌండ్ వెలుపల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతోంది.నటాషాతో విడాకుల తర్వాత, జాస్మిన్ వాలియాతో రిలేషన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే, ఇదంతా నిజమా? లేక కేవలం పుకార్లేనా? అన్నదానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.