లక్నో ను చిత్తుగా ఓడించిన ముంబై.. ఫీల్డింగ్ అదరగొట్టిన రోహిత్ సేన..!
TeluguStop.com
తాజాగా జరిగిన ఎలిమినేటర్ ( Eliminator Match )మ్యాచ్లో లక్నో జట్టు ముంబై చేతిలో చిత్తుగా ఓడింది.
ముంబై ( MI )జట్టు ఫీల్డింగ్ ముందు లక్నో బ్యాటర్లు చేతులెత్తేశారు.81 పరుగుల తేడాతో ముంబై జట్టు ఘనవిజయం సాధించి క్వాలిఫయర్-2( Qualifier 2 ) అర్హత సాధించి గుజరాత్ జట్టుతో పోటీ పడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్నిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
ఓపెనర్ లైన ఇషాన్ కిషన్ 15, రోహిత్ శర్మ 10 పరుగులతో పెవిలియన్ చేరి విఫలమయ్యారు.
కామెరున్ గ్రీన్ 41, సూర్య కుమార్ యాదవ్ 33, నేహల్ వధేరా 23 పరుగులు చేయడంతో ముంబై 182 పరుగులను నమోదు చేయగలిగింది.
లక్నో బౌలర్ నవీనుల్ హక్( Naveen Ul Haq ) కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు.
యశ్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా, మోసిన్ ఖాన్ ఒక వికెట్టు తీశాడు.
"""/" /
ముంబై జట్టు నమోదు చేసిన 182 పరుగులను ఛేదించడం పెద్ద కష్టమేమి కాదు.
లక్ష్య చేదనకు దిగిన లక్నో జట్టు 8 ఓవర్ల వరకు అద్భుతంగానే రాణించింది.
అప్పటికి స్కోరు 69/2 గా ఉంది.కానీ ఆకాశ్ మధ్వల్( Akash Madhwal ) బౌలింగ్ దాటికి లక్నో బ్యాటర్లు చేతులు ఎత్తేశారు.
మరో 32 పరుగులకే లక్నో మిగిలి ఉన్న ఎనిమిది వికెట్లను కోల్పోయింది.
16.3 ఓవర్లలో 101 పరుగులు చేసి లక్నో ఆల్ అవుట్ అయింది.
ముంబై బౌలర్లు కేవలం బౌలింగ్లో మాత్రమే కాదు ఫీల్డింగ్ లో కూడా అదరగొట్టి ముగ్గురు బ్యాటర్లను రన్ అవుట్ చేశారు.
క్రమంగా నెట్ రన్ రేట్ పెరుగుతూ పోతోంది.లక్నో బ్యాటర్లపై ఒత్తిడి పెరగడంతో వరుసగా వికెట్లను కోల్పోయి చిత్తుగా ఓడింది.
ఇక ప్లే ఆఫ్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన అరుదైన రికార్డ్ ఆకాష్ మధ్వల్ ఖాతాలో వేసుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.ముంబై జట్టు ఫైనల్ కు వెళ్లాలంటే గుజరాత్ తో జరిగే మ్యాచ్లో ఇలాగే బ్యాటింగ్, ఫీల్డింగ్ లో సమర్థవంతంగా రాణించాలి.
ప్రసాద్ బెహరాపై పరోక్షంగా కామెంట్స్ చేసిన రేఖా భోజ్.. నిజస్వరూపం ఇదేనంటూ?