ముంబై నటి వ్యవహారం .. జగన్ పై షర్మిల విమర్శలు
TeluguStop.com
వైసీపీ అధినేత జగన్ పై ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ( AP Congress President Sharmila )విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.
వైసిపి అధికారంలో ఉన్న సమయంలోనూ , ఎన్నికలకు ముందు అనేక విమర్శలు చేసి జగన్ ను ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించిన షర్మిల ఇప్పుడు కూడా అదే విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు.
తాజాగా ముంబై నటి కాదాంబరి జత్వాని( Actress Kadambari Jatwani ) వ్యవహారం పైన షర్మిల తాజాగా స్పందించారు.
తాజాగా ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కు షర్మిల వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా జగన్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేశారు .
"""/" /
మాజీ సీఎం జగన్ గత ఏడాది స్టీల్ ప్లాంట్ ( Steel Plant )కు శంకుస్థాపన చేసినా, దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.
పరిశ్రమ ఏర్పాటుపై కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా షర్మిల అన్నారు.
ఇక ముంబై నటి కాదాంబరి జత్వాని వ్యవహారం పైన జగన్ ( Jagan )ను టార్గెట్ చేసుకునే విమర్శలు చేశారు ఆమెను ఎలా కట్టడి చేయాలో జగన్ , సజ్జన్ జిందాల్ కలిసి ప్లాన్ చేశారని షర్మిల ఆరోపించారు.
"""/" /
'' సజ్జన్ జిందాల్ ( Sajjan Jindal )జగన్ మధ్య సానిహిత్యాన్ని గొప్పగా చెప్పుకున్నారు.
జిందాల్ కు ఎందుకు అన్ని కోట్ల రూపాయల ఆస్తి కట్టబెట్టారో జగన్ సమాధానం చెప్పాలి.
కాదాంబరి జత్వాని ఓ మహిళ యాక్టర్.ఆమెను మానసికంగా వేధించారు.
ఒక మహిళను అడ్డుకునేందుకు ఇంత నీచంగా మారాలా ? యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారు.
కేసు పెట్టబోతే అక్రమంగా నిర్బంధించి తొక్కిపడేసారు.ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకువచ్చి అరెస్టు చేయడం దుర్మార్గం.
జగన్ కు తెలియకుండానే అప్పటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా ? ఇద్దరు కూతుళ్ళు ఉన్న జగన్ జాత్వానికి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు ? ఈ వ్యవహారంపై ఆయన సమాధానం చెప్పాలి.
ఆమెకు అండగా ఉండి పోరాటం చేసినందుకు నేను సిద్ధం '' అంటూ షర్మిల అన్నారు.
కువైట్‌కు అండగా నిలుస్తాం .. ప్రవాస భారతీయులతో నరేంద్ర మోడీ