అజిత్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
TeluguStop.com
ప్రజెంట్ మల్టీస్టారర్ ( Multi - Starrer) ట్రెండ్ నడుస్తుంది.ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఇదే పేరు జపిస్తున్నారు.
ఏ ఇండస్ట్రీలో అయినా మల్టీ స్టారర్ హవా కొనసాగుతుంది.రాజమౌళి ఆర్ఆర్ఆర్ వంటి మల్టీ స్టారర్ తీసి ఇది వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయ్యాక మరింత ట్రేండింగ్ లోకి వచ్చేసింది.
అప్పటి నుండి అవకాశం ఉంటే ఏ డైరెక్టర్ అయినా ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ చేయాలని అనుకుంటున్నారు.
ఇక ఇప్పుడు మరొక మల్టీ స్టారర్ గురించి తెరపైకి వచ్చింది.అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో.
టాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి మల్టీ స్టారర్ తీయబోతున్నట్టు తెలుస్తుంది.మరి ఈ కథను ఎవరు రాసారు? అనేది తెలుసా.
"""/" /
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రైటర్ విజయేంద్ర ప్రసాద్ ( Vijayendra Prasad ) అంటే అందరికి తెలుసు.
ట్రిపుల్ ఆర్ వంటి సూపర్ హిట్ సినిమాతో ఈయన ఇంటర్నేషనల్ రైటర్ గా గుర్తింపు పొందారు.
మరి అలాంటి విజయేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు మరో మల్టీ స్టారర్ ను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తుంది.
"""/" /
మరి ఈసారి ఏ స్టార్ హీరోలను కలుపుతున్నాడో తెలుసా.కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar), అలాగే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) లతో కలిసి ఒక మల్టీ స్టారర్ ను సిద్ధం చేస్తున్నారట.
ఇప్పటికే అద్భుతమైన కథను కూడా సిద్ధం చేసి దాన్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.
ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేసి డైలాగ్స్ రాయిస్తున్నారని తెలుస్తుంది.
అంతేకాదు ఈ సినిమాకు డైరెక్టర్ గా రాజమౌళి ( Rajamouli ) వ్యవహరించ బోతున్నాడని అనే టాక్ కూడా వస్తుంది.
మహేష్ ( Mahesh Babu ) తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఇదే అని న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
అలాగే అజిత్, అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వీరికి కూడా కథ బాగా నచ్చినట్టు అంటున్నారు.
ఇదే నిజమైతే ఈసారి రికార్డులను ఆపడం ఎవ్వరి వల్ల కాదు.
తేజ ఏం సినిమా చేస్తున్నాడు…రానా మూవీ ఆగిపోయిందా..?