సోహెల్( Sohel ) హీరోగా నటించిన తాజా చిత్రం బూట్ కట్ బాలరాజు.
( BootCut Balaraju ) తాజాగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్( Mukku Avinash ) ఈ సినిమా ప్రమోషన్స్ ని వినూత్నంగా నిర్వహించాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన స్నేహితులతో కలిసి రోడ్లపై చక్కర్లు కొడుతూ.
బూట్ కట్ బాలరాజు సినిమా చూడాలని ప్రచారం నిర్వహించారు.అనంతరం ఓకే వైన్ షాప్ దగ్గరకు వెళ్లి.
అక్కడికి వచ్చిన ముందు బాబుల్ని తనకి 90 మందు ఇప్పించాలని అడిగాడు. """/" /
అయితే చాలామంది మందుబాబులు అవినాష్‌కి మందు పోయించడానికి పోటీ పడ్డారు.
తన దగ్గర డబ్బుల్లేవని మందు తాగాలని ఉంది నాకు 90 ఇప్పించండని వైన్ షాప్( Wine Shop ) దగ్గరకు వచ్చిన మందు బాబుల్ని అడిగాడు.
దీంతో మందు బాబులు నేను ఇప్పిస్తానంటే నేను ఇప్పిస్తాను అంటూ పోటీపడ్డారు.అనంతరం ముక్కు అవినాష్.
అక్కడికి వచ్చిన మందు బాబుల్ని ఖుషీ చేస్తూ వాళ్లందరికీ 90 బాటిల్స్ పంచిపెట్టాడు.
దీంతో ఒక మందు బాబు కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యా నువ్వు దేవుడయ్యా అనే రేంజ్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా ముక్కు అవినాష్ అన్న జై అంటూ సంబరాలు చేసుకున్నారు మందుబాబులు.
"""/" /
అవినాష్‌ని భుజాలపై పైకి ఎత్తేశారు.అప్పుడు అవినాష్ వాళ్ళందరికీ ఈ సినిమా చూడండి అంటూ విజ్ఞప్తి చేశాడు.
అందరూ సరే అంటూ కొద్దిసేపు అవినాష్ ని పొగడ్తలతో ముంచెత్తారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అవినాష్ విషయానికి వస్తే జబర్దస్త్ తో( Jabardasth ) పాటు పలు ఈవెంట్లలో ఆలోచించిన అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ షో కి దూరంగా ఉండటంతో పాటు వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నాడు.
స్టార్ మా లో ప్రసారం అవుతున్న శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలో తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను నవ్విస్తున్నాడు అవినాష్.
భారీగా పెరిగిన ఎన్ఆర్ఐల డిపాజిట్లు .. 2023తో పోలిస్తే ఎన్ని కోట్లంటే?