హీరోగా వెండి తెర సందడికి సిద్ధమైన ముక్కు అవినాష్!
TeluguStop.com
బుల్లితెరపై ప్రసారమైనటువంటి జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కమెడియన్ ముక్కు అవినాష్ ( Mukku Avinash ).
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయనకు అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం లభించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అవినాష్ మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ కార్యక్రమం తర్వాత ఈయన పలు సినిమాలలో నటించడం అలాగే బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
"""/" /
ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.
ఇక తనకంటూ ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ కెరియర్ పరంగా బిజీగానే ఉన్నారు.
తాజాగా ముక్కు అవినాష్ వెండితెరపై హీరోగా సందడి చేసే అవకాశాన్ని అందుకున్నారు.ఈ క్రమంలోనే ఈయన హీరోగా ఓ సినిమాకు కమిట్ అయ్యారని ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగాయని తెలుస్తుంది.
"""/" /
ముక్కు అవినాష్ హీరోగా రాకేష్ దుబాసి( Rakesh Dubasi ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ ( Pre Wedding Prasad ) డెక్కన్ డ్రీమ్స్ వర్క్స్ పై నభి షేక్ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా హైదరాబాదులో ఘనంగా పూజ కార్యక్రమాలను జరుపుకుంది.
ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ముక్కు అవినాష్ మాట్లాడుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
మా సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని ఈ సినిమాని చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుకోవడమే కాకుండా భయపడతారు అలాగే ఎక్సైట్ గా ఫీల్ అవుతారు ఇలాంటి ఒక మంచి సినిమాని చేసే అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలా హీరోగా ముక్కు అవినాష్ ఎంట్రీ ఇస్తున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
164 అడుగుల లోయలో పడిపోయిన ప్రెగ్నెంట్ టీచర్… చివరికేమైందో తెలిస్తే?