ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయని సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారన్నారు, సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందన్నారు.
వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం సందర్భంగా వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయన్నారు, సత్సంగ సదనం లో ప్రత్యేకంగా అలంకరించి ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకున్నారు.
అనంతరం ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి భక్తులకు ఆయన వివరించారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి బాలాలయం లో ఉత్తర ద్వారా దర్శన చేసుకున్న భక్తులు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి బాలాలయం లో ఆలయకమీటీ వారు పూలతో ప్రత్యేకంగా అలంకరించిన ఉత్తర ద్వారం దర్శనం కన్నుల పండువగా జరిగింది ఉత్తర ద్వారం దర్శనం చేసుకుని భక్తులు స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి నవీన్ చారి పత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా పాల్గొన్న భక్తకోటికి ఆలయకమీటీ అధ్యక్షులు గడ్డం జితేందర్ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్ లు , బొమ్మ కంటి శ్రీ నివాస్ గుప్తా, మెగి నర్సయ్య , బాలయ్య గుప్తా , శ్యామ మంజుల , శనగలు, సీరా తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
అనంతరం కృష్ణ భక్తులు సనుగుల ఈశ్వర్, పోతు ఆంజనేయులు, సందుపట్ల లక్ష్మారెడ్డి, పారిపెల్లి రాంరెడ్డి, మహిళా భక్తుల బృందం భక్తి శ్రద్ధలతో భజన చేశారు.
వాటే టాలెంట్ గురూ.. రైలులో రద్దీని తట్టుకోలేక అతడు ఏకంగా?