నూతన ప్రసాద్ లాగే ఈ హీరోయిన్ కి కూడా యాక్సిడెంట్ అయింది.ఏమైందంటే..?
TeluguStop.com
సినిమా వాళ్ళ జీవితాలు చాలా కలర్ ఫుల్ అని అంతా అనుకుంటారు.కానీ వాళ్ళ రిస్క్ ఇంకొకరికి ఉండదు అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ.
ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో వీళ్ళు ఒళ్లు హూనమైపోయెలా.కష్టపడుతుంటారు.
అక్కడ ఏమాత్రం గాయాలపాలైనా సర్జరీలు, నెలల పాటు బెడ్ రెస్ట్ లు తీసుకోవాల్సి వస్తుంది.
అప్పుడు వీళ్ళకి వచ్చే పారితోషికం కూడా అందులో చాలా వరకు పెట్టాల్సి వస్తుంది.
స్టార్ హీరోలకు, హీరోయిన్ లకి ఈ ప్రాబ్లం ఉండదు.అదే చిన్న హీరోలు, హీరోయిన్లు అయితే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చులో సగం చెల్లించాలి… మిగిలింది నిర్మాణ సంస్థ చెల్లిస్తుంది అని కొంతమంది నటీనటులు చెప్పారు.
అయితే నటుడు నూతన ప్రసాద్ కి( Actor Nutan Prasad ) ఒక సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదం లో తన వెన్నుముక కి గాయం అవ్వడం తో తను ఇక మిగితా కెరియర్ అంత వీల్ చైర్ లోనే కూర్చోవాల్సి పరిస్థితి వచ్చింది.
తను అలా ఉంటూ కూడా చాలా సినిమాల్లో నటించాడు. """/" /
ఇక మొన్న ఆ మధ్య వచ్చిన ముఖ చిత్రం( Mukha Chitram Movie ) సినిమా లో హీరోయిన్లుగా ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ లు ( Ayesha Khan ) నటించారు.
అయితే కార్ యాక్సిడెంట్ సీన్ చిత్రీకరిస్తున్న టైంలో ఆమెకు అనుభవం లేకపోవడం వల్ల నిజంగానే గాయపడిందట.
అయితే సీనియర్ నటుడు నూతన ప్రసాద్ లాగే ఈమెకి కూడా సేమ్ యాక్సిడెంట్స్ అయింది దీంతో నడుము, వెన్ను భాగంలో పెద్ద గాయం తగిలింది.
కాకపోతే ఈమె తక్కువ బరువు ఉండడంతో త్వరగా కొలోకుందని, లేదంటే జీవితాంతం వీల్ చెయిర్ లో కూర్చోవాల్సి వచ్చేదని ఈ చిత్ర యూనిట్ తెలియజేసింది.
"""/" /
ఇలా సినిమా షూటింగ్స్ లో చాలా మందికి గాయాలు తగులుతూ ఉంటాయి కానీ అందులో కొందరు మాత్రం నూతన ప్రసాద్ గారిలా వాళ్ల సిని లైఫ్ ని కోల్పోవాల్సి వస్తుంది.
మరికొందరు మాత్రం కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే క్యూర్ అవుతారు అందుకే షూటింగ్ లు చేయడం చాలా కష్టం.
ఓటమిని అంగీకరిస్తున్నా.. నా పోరాటం ఆగదు, ట్రంప్‌కు శుభాకాంక్షలు : కమలా హారిస్