కలహరణం కోసం మరో ఎత్తుగడ, సుప్రీం మెట్లు ఎక్కిన నిర్భయ నిందితుడు

ఒకపక్క ఉరిశిక్ష అమలు దగ్గర పడుతుంటే మరో పక్క దానిని ఏ రకంగా జాప్యం చేయాలి అన్నట్లుగా నిర్భయ నిందితులు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారి తీస్తుంది.

మొన్నటికి మొన్న నిర్భయ దోషులు అయిన పవన్ గుప్తా,వినయ్ శర్మ,అక్షయ్ సింగ్ ల మెర్సీ,క్షమాభిక్ష పిటీషన్ ల విషయంలో తీహార్ జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల టైం కి పిటీషన్ లు దాఖలు చేయలేకపోయారు అంటూ కోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ పిటీషన్ ను ఢిల్లీ కోర్టు తిరస్కరించడం తో ఇక వారికి ఉరిశిక్ష ఖాయం అనుకంటున్న సమయంలో ఇప్పుడు తాజాగా నిర్భయ నిందితుల్లో ఒకరైన ముకేశ్ కుమార్ న్యాయవాది సుప్రీం కోర్టు లో మరో పిటీషన్ దాఖలు చేయడం గమనార్హం.

"""/"/ క్షమాభిక్ష కోసం తాను చేసుకున్న దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించడంపై జ్యుడీషియల్‌ సమీక్ష జరపాలంటూ ముకేశ్‌కుమార్‌ తరఫున న్యాయవాది వృందా గ్రోవర్‌ శనివారం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

ముకేశ్‌తోపాటు మరో ముగ్గురు దోషులు పవన్‌గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్‌సింగ్‌లను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉన్న ఈ సమయంలో ఇప్పుడు ఇలాంటి పిటీషన్ దాఖలు చేసి కలహరణం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకోవడం లేదు.. కాబోయే భర్త పై వరలక్ష్మి కామెంట్స్!