Mukesh Ambani : ముకేష్ అంబానీ మేనల్లుడి ఆస్తుల విలువ అన్ని రూ.కోట్లా.. మామకు తగ్గ అల్లుడంటూ?
TeluguStop.com
మన భారత దేశంలో అత్యంత సంపన్నుల కుటుంబం ఏది అంటే అందరూ కూడా టక్కున ముఖేష్ అంబానీ పేర్లను చెబుతారు.
ఇలా ముఖేష్ అంబానీ( Mukesh Ambani) ఎన్నో వ్యాపార సంస్థలను కలిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.
ముఖేష్ అంబానీ కుటుంబంలో నీతా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ వారి గురించి కూడా మనకు తెలిసిందే.
ఇలా ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యుల గురించి మనకు తెలిసినప్పటికీ ఇదే కుటుంబానికి చెందినటువంటి మరొక వ్యక్తి కూడా బిలినియర్ అనే విషయం చాలామందికి తెలియదు.
మరి ముఖేష్ అంబానీ కుటుంబంలోని బిలీనియర్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.
"""/" /
ముఖేష్ అంబానీ సోదరి నీనా కొఠారి ( Neena Kothari )గురించే చాలామందికి తెలియదు.
ఈమె కుమారుడే అర్జున్ కొఠారి( Arjun Kothari ) .ఈయన స్వయాన ముఖేష్ అంబానికి మేనల్లుడు కావడం విశేషం.
ఇక ఈయన సంపాదన ఆస్తిపాస్తులు మొత్తం 845 కోట్ల రూపాయలు కావటం విశేషం.
ఇలా వందల కోట్లకు అధిపతి అయినప్పటికీ ఈయన గురించి మాత్రం పెద్దగా బయట ఎవరికి తెలియకపోవడం గమనార్హం.
ఈయన కొఠారి పెట్రోల్ కెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్నారు.ఈయన అమెరికాలోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ రొటేషన్ తో సీనియర్ స్పెషలిస్ట్ హోదాని కలిగి ఉన్నారు.
"""/" /
ఇక ఈయన తమ వ్యాపారాలను చూసుకోవడం కోసం బ్యాచిలర్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు.
ఇలా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తమ కుటుంబ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తమ వ్యాపారాలు అన్నింటిని చూసుకుంటున్నారు.
ఇలా వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి చెందుతూ ఒక వ్యాపారవేత్తగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిలీనియర్ జాబితాలోకి చేరిపోయారు.
ఇలా వ్యాపార రంగంలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన అనంతరం ప్రముఖ వ్యాపారవేత్తలు అయినటువంటి అంజలి , రాజేన్ మారివాలా కుమార్తె ఆనందిత మారివాలాను వివాహం చేసుకున్నారు.
జర్మనీలో అత్యంత ఖరీదైన గోల్డెన్ క్రిస్మస్ ట్రీ.. ధర తెలిస్తే అవాక్కవుతారు..