ఆ ఉద్యోగికి రూ.1,500 కోట్ల భవనం బహుమతిగా ఇచ్చిన ముఖేష్ అంబానీ..!!

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ( Mukesh Ambani )డబ్బు సంపాదించడంలోనే కాదు వాటిని పంచడంలోనూ ముందుంటారు.

ఇప్పటికే ఎన్నో విరాళాలు చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్న అంబానీ ఇప్పుడు మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు.

ముఖేష్ అంబానీ తన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌( Reliance Industries Ltd )లో చాలా కాలంగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి అత్యంత విలువైన భవనాన్ని బహుమతిగా అందించారు.

"""/" / ఆ ఉద్యోగి పేరు మనోజ్ మోడీ( Manoj Modi ).

మనోజ్ చాలా కాలంగా రిలయన్స్ సంస్థలో నమ్మకస్తుడిగా కొనసాగుతున్నారు.అంతేకాదు, అంబానీకి మంచి సలహాదారుగా కూడా ఉంటూ వస్తున్నారు.

తనకి ఒక రైట్ హ్యాండ్ లాగా ఉన్న మనోజ్‌ అంటే అంబానీకి ఫస్ట్ నుంచీ ఇష్టమే.

అలాగే ఆయన తన కంపెనీకి అందిస్తున్న విలువైన సేవలకు కృతజ్ఞతగా అంబానీ రూ.

1,500 కోట్ల విలువ చేసే 22 అంతస్తుల భవనాన్ని బహుమతిగా ఇచ్చారు.మనోజ్‌కి ఇచ్చిన ఈ ఖరీదైన భవనం పేరు 'బృందావన్'( Brindavan ).

ఈ భవనం ముంబైలోని ప్రీమియం లోకాలిటీ అయిన నేపియన్ సీ రోడ్‌లో ఉంది.

ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీలు చదరపు అడుగుకు రూ.45,100 నుంచి రూ.

70,600 వరకు పలుకుతాయి. """/" / భవనం ప్రతి అంతస్తు 8,000 చదరపు అడుగులలో విస్తరించి ఉంది, భవనం మొత్తం వైశాల్యం 1.

7 లక్షల చదరపు అడుగులు.భవనంలోని మొదటి ఏడు అంతస్తులు కార్ పార్కింగ్ కోసం కేటాయించారు.

భవనంలో ఉపయోగించిన ఫర్నిచర్ ఇటలీ నుంచి తీసుకొచ్చారు.కాగా, మనోజ్ ముంబైలోని రెండు అపార్ట్‌మెంట్లను మొత్తం రూ.

41.5 కోట్లకు విక్రయించారు.

ఒక అపార్ట్‌మెంట్ 28వ అంతస్తులో ఉంది, ఇది 2,597 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, మరొకటి 29వ అంతస్తులో ఉంది.

నేపియన్ సీ రోడ్ ముంబైలోని అత్యంత రిచెస్ట్ ఏరియా అని చెబుతుంటారు.ఇక్కడే JSW గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ కూడా నివసిస్తున్నారు.

అడవిలో మంటను ఎలా పుట్టించాడో.. ఇది మాములు క్రియేటివిటీ కాదు, భయ్యో!