మొహరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? దీని విశిష్టత..!
TeluguStop.com
మొహర్రం( Muharram ) అనేది ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి పండుగ అని దాదాపు చాలామందికి తెలియదు.
ఇది కూడా ముస్లింలకు మరొక పవిత్ర మాసం.మొహర్రం మొదటి రోజును ఇస్లామిక్ నూతన సంవత్సరం లేదా అరబిక్ న్యూ ఇయర్( Arabic New Year ) అని అంటారు.
మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదిన కు ఈ సమయంలో వలస వచ్చినందున ఈనెల ముస్లింలకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది.
ఇది ముస్లింలలో ఇరు వర్గాలైన సున్ని షియాలకు చాలా చరిత్రకా ప్రాముఖ్యతను కలిగి ఉంది.
ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుడు గమనంపై ఆధారపడి ఉండడం వల్ల నెలవంక ఆధారంగా ఆయా తేదీలను నిర్ణయిస్తారు.
సాధారణంగా ముస్లింలకు సంబంధించిన ఏ పండుగా లేదా పవిత్ర దినమైన సౌదీ అరేబియా,యుఎఇ, ఒమన్ మొదలైన గల్ఫ్ దేశాలలో నెలవంక గమనించిన ఒక రోజు తర్వాత భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, మొరాకో దేశాలలోనీ ముస్లింలు గమనిస్తారు.
"""/" /
2023లో మొహర్రంను జూలై 19న బుధవారం రోజు జరుపుకుంటున్నారు.దీని ప్రకారం భారతదేశంలో జూలై 20 నుంచి మొహర్రం ప్రారంభం అవుతుందని నివేదనలు వెల్లడించాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ముస్లింలలో( Muslims ) మొహర్రం కు చాలా ప్రాముఖ్యత ఉంది.
ఈ రోజు ప్రవక్త మహమ్మద్ మనవడు హుస్సేన్ ఇబ్న్ అలీ అమరత్వాన్ని స్మరించుకుంటారు.
మొహర్రం నెలలోని పదవ రోజున అషూరా( Ashura ) దినంగా పాటిస్తారు.ఈ అషూరా రోజు కర్బలా యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త ప్రియమైన మనవడైన ఇమామ్ హుస్సేన్ ను అత్యంత క్రూరంగా హత్య చేశారు.
"""/" /
పోరాటం నిషేధించిన నెలలో అతను దారుణంగా హత్యకు గురవుతారు.ఆ తరువాత మొదటి ఇస్లామిక్ రాజ్య స్థాపనకు దారితీసింది.
హుస్సేన్ అలీ మరణాన్ని స్మరిస్తూ మొహర్రం ను పాటిస్తారు.ముస్లింలు అషూరా ముందు 9వ రోజు ఉపవాసం( Fasting ) పాటిస్తారు.
ఇంకా చెప్పాలంటే మొహర్రం ను సున్ని, శియా ముస్లింలు భిన్నంగా పాటిస్తారు.షియాలు ఈ పవిత్ర దినం సంతాప దినంగా పాటిస్తారు.
షియా ముస్లింలు సంతాపం ఊరేగింపులు, శోకం, బాధను వ్యక్తికరిస్తారు.మరోవైపు ప్రవక్త మహమ్మద్, ప్రవక్త మూసా ఈ రోజు రోజాను ఆచరించడం వల్ల సున్ని ముస్లిం లు ఉపవాసం సున్నత్ పాటిస్తారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్, టీషర్ట్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే!