మొగలి పువ్వు పూజకు అర్హత లేకుండా పోవడానికి కారణం ఏమిటో తెలుసా?

దేవుడి పూజ కోసం ఎన్నో రకాల పుష్పాలను మనం ఉపయోగిస్తాం.కానీ పుష్పాలలో ఒకటైన మొగలి పువ్వు ను ఏ పూజలోను ఉపయోగించరు.

అయితే ఈ విధంగా మొగలిపువ్వు పూజకు అర్హత లేకుండా పోవడానికి కారణం చాలా మందికి తెలియక పోవచ్చు.

మొగలి పువ్వు పూజకు అర్హత లేకుండా పోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పరమశివుడు వారికి కళ్లు తెరిపించాలనే భావనతో వారిమధ్య లింగరూపంలో పుట్టి బ్రహ్మను నా శిరస్సు ఎక్కడుందో వెతికి రమ్మన్నారు.

అదేవిధంగా విష్ణుకు తన పాదాలు వెతికి రమ్మన్నారు.శివుడు ఆజ్ఞ మేరకు బ్రహ్మ విష్ణువులు ముల్లోకాలను గాలించినప్పటికీ వారికి శివుడి తల, పాదాలు ఎక్కడ ఉన్నాయో అంతుచిక్కలేదు.

ఈ విధంగా బ్రహ్మ, విష్ణు ముల్లోకాలను గాలించినా శివుడి పాదాలు, తల జాడ తెలియకపోవడంతో చివరికి వారు గొడవపడిన చోటికి వచ్చారు.

దీంతో విష్ణుమూర్తి తనకు పాదాలు ఎక్కడా కనిపించలేదని అసలు విషయం తెలియజేశాడు.

కానీ బ్రహ్మ కుటిల బుద్ధితో ఎలాగైనా తనే గెలవాలని తన వెంట ఒక ఆవును, మొగలి పువ్వు ను తీసుకువచ్చాడు.

లింగం తల చూశానని మొగలి పువ్వుతో అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు.బ్రహ్మ ప్రలోభాలకు లోనయిన మొగలిపువ్వు లింగం తల చూసినట్లు అబద్ధపు సాక్ష్యం చెబుతుంది.

"""/" / అదేవిధంగా కామదేనువుని అడగగా, అది తన తోకతో అడ్డంగా ఊపుతూ ఇది అబద్ధమని అసలు విషయం బయట పెట్టింది.

దీంతో మొగలిపువ్వు అబద్ధం చెప్పింది అని భావించిన విష్ణుమూర్తి మొగలిపువ్వు అబద్ధం చెప్పింది కనుక ఈ పువ్వు పూజకు అనర్హం అంటూ శాపం పెట్టాడు.

అదేవిధంగా కామదేనువు వెనుక భాగంతో సత్యం చెప్పినది కనుక వెనుకభాగం పూజార్హమగుగాక అని వరం ఇస్తాడు.

అప్పటి నుంచి మొగలి పువ్వును ఎటువంటి పూజలో కూడా ఉపయోగించరు.

దేవర 100 డేస్ సెంటర్ల లెక్క ఇదే.. వామ్మో అన్ని థియేటర్లలో 100 రోజులు ఆడిందా?