ఆ విషయానికి సంబంధించి సీఎం జగన్ ని ప్రశ్నించిన ముద్రగడ..!!

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అందరికీ సుపరిచితమే.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముద్రగడ్డ పద్మనాభం చేసిన దీక్ష అప్పట్లో సంచలనం సృష్టించింది.

అయితే రాజకీయంగా అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ముద్రగడ.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయి.కాపుల హక్కుల కోసం పోరాడుతున్నారు.

కాగా తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కి ముద్రగడ పద్మనాభం లెటర్ రాయడం జరిగింది.

దానిలో వన్ టైం సెటిల్మెంట్ (ఓటిఎస్) పథకాన్ని తప్పుపట్టడం జరిగింది.ఓటిఎస్ విధానంతో ప్రజలపై ఒత్తిడి తీసుకు రావద్దని.

లెటర్ లో స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని.

వెంటనే చెల్లించాలని సూచించారు.గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన ఇళ్లకు ఓటిఎస్ పథకాన్ని మీరు ఎలా వర్తింప చేస్తారు.

? నీకు ఎక్కడిది అధికారం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని మీరు.

ఓటిఎస్ పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారం లేదని.ముద్రగడ పద్మనాభం తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Kishan Reddy : బీజేపీకి ఏ పార్టీ పోటీ లేదు..: కిషన్ రెడ్డి