ఈటలకు చెక్ పెట్టేందుకే రంగంలోకి హరీష్‌ను దించారా.. కేసీఆర్ పై ముదిరాజ్ నేత ఆరోపణలు.. ?

తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి కలిసి ప్రస్తానాన్ని మొదలు పెట్టారు.కానీ రాజకీయం ఆడిన చదరంగంలో ఎత్తులన్ని చిత్తు అయ్యాయి.

ఎన్నో సంవత్సరాల స్నేహం, బంధం ఒక్క సారిగా బద్ద శత్రువుల్లా మారిపోయాయి.ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ నుండి విడిపోయిన ఈటల రాజేందర్ పొలిటికల్ కేరీయర్ ఇకనుండి టఫ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని, కొత్త రాజకీయ పోరు నివురుగప్పిన నిప్పులా మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై, హుజూరాబాద్ ముదిరాజ్ మహాసభ ఇంచార్జీ కుమారస్వామి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తనకు అక్కరకు వచ్చేంత కాలం కుడి, ఎడమ భుజాలుగా హరీశ్ రావు, ఈటల రాజేందర్ లను వాడుకున్నారని, తాను ఒడ్డున పడగానే ఈటలను రాజకీయాలకు దూరంగా ఉంచాలనే దురుద్దేశ్యంతో లేనిపోని కేసులను అల్లుతున్నాడని విమర్శించారు.

అదీగాక వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.ఇక కేసీఆర్ అధికార దాహానికి ఈటలతో పాటుగా హరీశ్ రావు కూడా గురవుతున్నారని ఆరోపించారు.

ఇక ఈటలను ఒంటరిగా ఎదుర్కొనలేక తనకు చెక్ పెట్టేందుకు హరీశ్ ను కేసీఆర్ రంగంలోకి దించారని, కానీ, ఈటల వెనుక వేలాది మంది ట్రబుల్ షూటర్లు ఉన్న విషయం గుర్తుంచుకోండని హెచ్చరించారు కుమారస్వామి.

బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు జుట్టు రాలడాన్ని కూడా అడ్డుకుంటుంది.. ఎలా వాడాలంటే?