ముదిరాజులకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి: ముదిరాజ్ సంఘం డిమాండ్

ముదిరాజులపై అనుషిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా యావత్ ముదిరాజులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ముదిరాజుల మనోభావాలకు బంగం కలిగించిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని లేదంటే ఆందోళన చేపడతామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు శీలం పాపారావు లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈరోజు శనివారం స్థానిక అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు అనంత వారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిని అని మరిచిపోయి కండ్ల కావరంతో వల్లు మదమెక్కిన బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ ముదిరాజుల కులానికి చెందిన ఓ చానల్ రిపోర్టర్ ను కిడ్నాప్ చేసి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి కొట్టడం కాకుండా నోటికొచ్చిన విధంగా అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు.

ముదిరాజులపై అనుషిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే భర్తరఫ్ చేయాలని లేదంటే వచ్చే ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి ప్రతానపు వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ కొప్పెర జానకిరాములు, ఉపాధ్యక్షులు కొప్పెర వెంకనర్సయ్య, ప్రతానపు రామనాధం,దంతాల కేశవులు,పడిశబోయిన రమేష్, కార్యదర్శులు కాళంగి మోహన్ రావు,తిప్పట్ల నర్సింగరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గొడుగు నాగేశ్వరరావు, కోశాధికారి గాదె రాంబాబు, యూత్ జిల్లా అధ్యక్షులు పొన్నెబోయిన సాయి, యూత్ జిల్లా నాయకులు వెంగంపల్లి సురేష్,కుడితి సురేష్, దంతాల నర్సింహరావు,బాషబోయిన ఉపెందర్,పందుల ఉపేందర్,శీలం నాగేశ్వరరావు, పిట్టల రాంబాబు, కొప్పెర సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.

స్టార్ హీరో ప్రభాస్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ఖరీదెంతో తెలుసా.. ఏకంగా అంత ఖర్చు చేశారా?